BrahmaMudi 20th February Episode:ముద్దుగా బొద్దుగా కావ్య బావ.. రాజ్ లో మొదలైన అసూయ, గేమ్ మొదలెట్టిన కావ్య..!

First Published | Feb 20, 2024, 11:13 AM IST

వాళ్ల బావను చూడాలని రాజ్ పరుగులు తీస్తాడు. జెలస్ ఫీలౌతున్నావా అని శ్వేత అడిగితే.. నాకెందుకు అసలు వాళ్ల బావ ఎలా ఉంటాడా అని చూద్దామని వచ్చాను అంతే అంటడు.

Brahmamudi

BrahmaMudi 20th February Episode: రోడ్డు మీద కనపడిన అప్పూని తక్కువ చేయాలని అనామిక చాలా ప్రయత్నిస్తుంది.కానీ.. అప్పూ సరిగ్గా బుద్ధి చెబుతుంది.తాను తలుచుకుంటే కళ్యాణ్ ని ఇఫ్పుడు కూడా తన వైపు తిప్పుకోగలనని, తనది స్వచ్ఛమైన ప్రేమ అని  అంటుంది. కానీ.. తాను అలా చేయనని.. కళ్యాణ్ ని మంచిగా చూసుకోమని సలహాబ ఇస్తుంది. ఇలా రోడ్డుమీద పంచాయతీ పెడితే చివరికి రోడ్డు పాలు అవుతావు అని హెచ్చరిస్తుంది.  ఈ లోగా కళ్యాణ్ పిలవడంతో అనామిక వెళ్లిపోతుంది. 

Brahmamudi

అప్పూకి తన ఫ్రెండ్ ని బైక్ తీయమని అడుగుతుంది. అయితే.. అతను మాత్రం నిన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు ఊరుకున్నావ్ అప్పూ.. నువ్వు పోలీసు అవ్వాలని అనుకుంటున్నావని చెప్పొచ్చు కదా అంటాడు. కానీ.. అప్పూ మాత్రం వాల్లకు చెప్పాల్సిన అవసరం లేదని, మనం సాధించిన రోజు వాళ్లే తెలుసుకుంటారు అని అంటుంది. అక్కడితో వాళ్లు వెళ్లిపోతారు.


Brahmamudi

ఇక ఆఫీసులో రాజ్ టెన్షన్ ఫడుతూ ఉంటాడు. కావ్య ఇంకా రాలేదని కంగారుపడుతూ ఉంటాడు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని శ్వేత అంటే.. కంగారు ఏమీ లేదని.. బావ వస్తున్నాడని చెప్పిందని.. ఇంకా రాలేదు అని టైమ్ చూస్తూ ఉంటాడు. మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే  కావ్యకు నువ్వు అవసరం లేదేమో అని శ్వేత అంటే.. అవును కదా అని అంటాడు. కానీ ఈలోగా కావ్య వస్తుందని.. వాళ్ల బావను చూడాలని రాజ్ పరుగులు తీస్తాడు. జెలస్ ఫీలౌతున్నావా అని శ్వేత అడిగితే.. నాకెందుకు అసలు వాళ్ల బావ ఎలా ఉంటాడా అని చూద్దామని వచ్చాను అంతే అంటడు.

Brahmamudi

ఇక కావ్యతో పాటు వాళ్ల బావ కూడా కారు దిగుతాడు. అప్పలమ్మకు బావ అంటే అప్పలయ్యలాగా ఉంటాడు అనుకున్నానని కానీ.. హీరోలా ఉన్నాడేంటి అని అతనిని చూడగానే రాజ్ ముఖం మాడిపోతుంది. ఇక.. ఆఫీసులో వాళ్లు కూడా కావ్య బావను చూసి పలకరిస్తూ ఉంటారు. అది చూసి రాజ్ రగిలిపోతూ ఉంటాడు. ఇక అతనికి రాజ్ ని పరిచయం చేస్తుంది కావ్య. అతను కూడా అన్నయ్య అంటూ పలకరిస్తాడు. కావ్యను బుజ్జి అని పిలుస్తూ ఉంటాడు.  మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మా స్వప్న పారిపోయినట్లు.. కావ్య కూడా పారిపోయి ఉంటే నేను అమెరికా నుంచి వచ్చి పెళ్లి చేసుకునేవాడిని అని, కానీ మా బుజ్జి మీతో కమిట్ అయిపోయిందని తెగ  ఫీలౌతాడు. అదంతా చూసి రాజ్ కి మండిపోతూ ఉంటుంది. ఆ ఫ్రస్టేషన్ ఉద్యోగులపై చూపిస్తాడు.

Brahmamudi

కావ్యకు మండిపోవాలని శ్వేత భుజం మీద చెయ్యి వేసి నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత మీరు మళ్లీ అమెరికా ఎప్పుడు వెళ్లిపోతారు అని అడుగుతాడు. అయితే.. మామూలుగా అయితే వారం రోజులు ఉందామని అనుకున్నానని, కానీ తన బుజ్జినిచూసిన తర్వాత  అసలు వెళ్లాలనే అనిపించడం లేదు అని అంటాడు. తర్వాత కావ్య వాళ్ల బావను తన క్యాబిన్ కి తీసుకువెళితే..  రాజ్ .. శ్వేతను తీసుకొని వెళతాడు.

లోపలికి వెళ్లిన తర్వాత  కావ్యతో వాళ్ల బావ మంచిగా మాట్లాడతాడు. మనం చేసేది కరెక్టేనా, పద్దతేనంటావా అని అడుగుతాడు. నువ్వు నాతో  క్లోజ్ గా ఉంటే ఆయనకు కోపం వస్తుందని అదిచాలు అని కావ్య అంటుంది. కానీ నీ గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటారే మో అని అంటే... అది తాను చూసుకుంటాన అని కావ్య అంటుది.రాజ్ జెంటిల్ మెన్ లా ఉన్నాడని, కానీ నీ విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతాడు. ఆయనకు తిక్క అని, ఆయన శ్వేతను ఎలా వాడుకుంటున్నాడో.. నేను నిన్ను అలా అడ్డుపెట్టుకుంటున్నాను ఆయనలో మార్పు వచ్చేంత వరకు మన నటన రక్తి కట్టించాలి అని అంటుంది.

Brahmamudi

ఇక వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే.. రాజ్ అక్కడక్కడే కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు. మాటలు వినాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. డిజైనర్ శ్రుతి వచ్చి.. లోపల ఏం మాట్లాడుకుంటారో విని వచ్చి నేను చెప్పనా అని అడుగుతుంది.

Brahmamudi

అవసరం లేదని పంపించేస్తాడు. రాజ్ వాళ్ల మాటలు వినాలని ప్రయత్నిస్తున్నాడని కావ్య చూసేస్తుంది, ఇక ఇద్దరూ కలిసి.. మళ్లీ ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడతారు. నీకు నేనున్నాను బుజ్జి అంటూ ఉంటాడు.

Brahmamudi

ఇక రాజ్ వింటున్నాడని కావ్య వెళ్లి డోర్ తీస్తుంది. రాజ్ వచ్చి కావ్య మీదపడతాడు. లోపలికి వచ్చి కూర్చోమని కావ్య అంటుంది. దానికి రాజ్ కాలు జారి పడ్డానని కవర్ చేసుకుంటాడు. అయితే.. మేం మాట్లాడుకోవాలి వెళ్లిపోమ్మని కావ్య చెబితే రాజ్ తన క్యాబిన్ కి వెళతాడు. రాజ్ జెలస్ ఫీలౌతున్నాడని.. నువ్వు కావ్య ను ప్రేమిస్తున్నావని శ్వేత చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ రాజ్ వినిపించుకోడు.

Brahmamudi

ఈలోగా కేక్ తెప్పించి.. కావ్య ఉడుక్కునేలా చేయాలని అనుకుంటాడు. అందరినీ పిలిచి తన ఫ్రెండ్ శ్వేతకు విడాకులు వచ్చాయని సెలబ్రేషన్స్ అని చెబుతాడు. శ్వేత విడాకుల కోసం తాను ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాను  అని చెబుతాడు. ఎందుకు అని కావ్య వాళ్ల బావ అడిగితే.. ఆ విషయం మీ మరదలికి బాగా తెలుసు అని అంటాడు. అప్పుడే శ్వేత రెండో పెళ్లి టాపిక్ వస్తుంది. ఇదే విషయంలో కావ్య... తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.  మనసులు కలవకుండా కలిసి ఉండటం ఎందుకు విడిపోడమే బెటర్ అన్నట్లుగా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!