ట్రెండీ అవుట్ ఫిట్ లో మాళవికా మోహనన్ కిల్లింగ్ స్టిల్స్.. టాప్ అందాలతో మైమరిపిస్తున్న యంగ్ బ్యూటీ

First Published | May 26, 2023, 4:18 PM IST

తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan)  అదిరిపోయే ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. గ్లామర్ మెరుపులతో కుర్రాళ్ల చూపులను కట్టిపడేస్తోంది. లేటెస్ట్ పిక్స్  వైరల్ గా మారాయి. 
 

కోలీవుడ్ చిత్రాలతో మాళవిక మోహనన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  తమిళ స్టార్ హీరోల సరసన నటించిన ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఇతర భాషల చిత్రాల నుంచి కూడా ఆఫర్లు అందుతున్నాయి. 
 

తమిళంలో విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్డ్ కావడంతో ఇక్కడ గుర్తింపు వచ్చింది. త్వరలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హిందీలోనూ ఓ సినిమా చేస్తోంది.


ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ కుర్రభామ ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 

తాజాగా మాళవికా ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను నెట్టింట షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. లేటెస్ట్ లుక్ లో మాళవికా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ జీన్స్,, టాప్ లో అదరగొట్టింది. కిల్లింగ్ ఫోజులతోనూ మైమరిపించింది.
 

తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించడంతోపాటు మాళవికా గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. ఎద అందాలతో, మత్తు పోజులతో, నిషా కళ్లతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. దీంతో ఫ్యాన్స్ , నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ నయా లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన ‘తంగలాన్’లో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ ‘యుద్ర’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక టాలీవుడ్ కు ఎంట్రీ ప్రయత్నం చేస్తుందని, ఇప్పటికే ప్రభాస్ - మారుతీ ప్రాజెక్ట్ లో నటిస్తోందని అంటున్నారు. దీనిపైనా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Latest Videos

click me!