గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. అది ఉన్నంత కాలమే డిమాండ్ ఉంటుంది. పొరపాటున షేప్ అవుట్ అయితే పట్టించుకునే నాథుడు ఉండదు. ఈ విషయం అనసూయకు బాగా తెలుసు. అందుకే ఆమె ఫిట్నెస్ అండ్ బ్యూటీ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సహజంగానే అనసూయ కొంచెం బొద్దుగా ఉంటుంది. ఇకపై లావు కాకుండా ఆమె చూసుకుంటారు.
27
Anasuya Bharadwaj
ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తారు. ఆహార నియమాలు పాటిస్తుంది. బరువు పెరగకుండా డైట్ ఫాలో అవుతారు. గంటల తరబడి జిమ్ లో కష్టపడుతున్న అనసూయ ఫోటోలు, వీడియోలు మనం చూడవచ్చు.
37
ఎంత కఠినంగా డైట్ ఫాలో అయినా అప్పుడప్పుడూ నియమాలు వదిలేయాల్సి ఉంటుంది. పార్టీలు, సోషల్ గ్యాథరింగ్స్ లో అందరితో పాటు తినడం తాగడం చేయాలి. లేదంటే మనల్ని ప్రత్యేకంగా చూస్తారు. అనసూయకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె డైట్ చీటింగ్ కి పాల్పడ్డారు.
47
ఇటీవల అనసూయ వెకేషన్ కి వెళ్లారు. ఆమె పెద్ద కొడుకు బర్త్ డే కాగా ఓ వారం రోజులు విహారానికి చెక్కేశారు. వెకేషన్ అంటే బయట ఫుడ్ తినాల్సిందే. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగినవి తినిపించాలి. మనం కూడా తినాలి. అనసూయ కూడా వెకేషన్ అనేక రుచికరమైన వంటలు లాగించేశారట. దాంతో బరువు పెరిగిన భావన కలుగుతుందట.
57
Anasuya Bharadwaj
జిమ్ లో కష్టపడుతున్న వీడియో పోస్ట్ చేసిన అనసూయ డిషెస్ తినకుండా ఉండాల్సింది అంటూ కామెంట్ పెట్టింది. అతిగా తిన్నందుకు ఇప్పుడు కరిగించాల్సి వస్తుందని ఆమె పశ్చాతాపం చెందుతున్నారు. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు.
67
ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి.అలాగే పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది.
77
విమానం టైటిల్ తో తెరకెక్కిన మూవీలో అనసూయ బోల్డ్ రోల్ చేశారు. ఈ చిత్రంలో ఆమె వేశ్యగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఓ సాంగ్ విడుదల కాగా అనసూయ పాత్ర పై క్లారిటీ వచ్చింది. అనసూయ డేరింగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పొచ్చు.