ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలను హీరోయిన్లు అన్నయ్య అని పిలిచే సందర్భాలు చాలా తక్కువ. రీయల్ లైఫ్ లో అలా పిలిచే వారు కూడా చాలా తక్కువ. కానీ ఎన్టీఆర్ ను అన్న అని పిలిచే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లుగా ఉండేవారు. ఏ సమస్య ఉన్నా తెలుగు పరిశ్రమను నాయకులుగా నడిపించింది ఈ ఇద్దరు హీరోలే. ఆతరువాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలు ఆ లెగసీని కంటీన్యూ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ఆ పాత్రను పోషిస్తున్నారు. ఇక ఆ కాలంలో ఎన్టీఆర్ అంటే అందరిలో ఒక భయం ఉండేది. ప్రతీ పని పర్ఫెక్ట్ గా చేసే వ్యక్తి, షూటింగ్ అంటే సరిగ్గా టైమ్ కు ఉండేవారు. హీరోయిన్లు కానీ, టెక్నీషియన్స్ కానీ ఎన్టీఆర్ తో షూటింగ్ ఉందటే వారి టైమ్ కంటే ముందే అందరు పక్కాగా అక్కడ ఉండేవారు.
25
హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన రామారావు
ఎన్టీఆర్ సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించారు. చాలామందిని స్టార్ హీరోయిన్లుగా మార్చిన ఘనత పెద్దాయదనే. రామారావు పక్కన హీరోయిన్ గా అవకాశం వచ్చిందంటే అదృష్టంగా భావించేవారు ఎందరో ఉన్నారు. సావిత్రి, జమున, శారద, వాణిశ్రీ, కృష్ణ కుమారి, శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఆయన సరసన ఆడి పాడారు. ఎన్టీఆర్ పక్కన ఏ హీరోయిన్ నటించినా కూడా ఆయన తో చాలా జాగ్రత్తగా, గౌరవంగా మాట్లాడేవారు. ఎన్టీఆర్ కూడా మితభాషి కావడంతో ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అయితే ఎన్టీఆర్ ను అందరు అన్నగారు అనిపిలుస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట ఆతరువాత కాలంలో చాలా ఫేమస్ అయ్యింది. అన్నగారు ఎన్టీఆర్ అన్న పదం చాలామంది నోట వినిపిస్తూనే ఉంటుంది. అయితే హీరోయిన్లు మాత్రం తమ హీరోను అన్న అని పిలవరు కదా? కానీ ఎన్టీఆర్ ను ఒక హీరోయిన్ మాత్రం అన్నగారు అని పిలిచేది. ఆమె ఎవరో కాదు కళాభినేత్రి వాణిశ్రీ.
35
వాణిశ్రీ మాత్రమే అలా పిలిచేవారు
ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో అన్నగారు అని పిలిచే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ. అసలు ఎన్టీఆర్ హీరోయిన్లతో ఎక్కువగా మాట్లాడేవారు కాదట. ఆయనతో మాట్లాడాలంటే కూడా భయపడేవారట. ఏదైనా అవసరం ఉంటేనే చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ ను కదిలించేవారట. ఆయకు ఇండస్ట్రీలో ఉన్న రెస్పెక్ట్ అది. ఇక ఎన్టీఆర్ స్వయంగా హీరోయిన్ ను పిలిచి మాట్లాడారంటే.. అది ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే అలా జరిగేదట. అలా ఓ సందర్భంలో తనను ఎన్టీఆర్ పిలిచి, మంచి కాంప్లిమెంట్ ఇచ్చని విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు వాణిశ్రీ. ఆయన అసలు అలా అంటారని ఊహించలేదనన్నారు వాణిశ్రీ.
వాణిశ్రీ మాట్లాడుతూ..'' ఎన్టీఆర్ మితభాషి.. సెట్ లో పెద్దగా ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు.. ఆయన సెట్ లో ఉన్నారంటే అందరు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఏదో సినిమా షూటింగ్ టైమ్ లో నన్న పిలిపించారు. నేను వెళ్లి.. అన్నగారు రమ్మన్నారట అని అడిగాను. అప్పుడు ఆయన రండి రండి వాణిశ్రీ గారు కూర్చొండి అని మాట్లాడటం మొదలు పెట్టారు. అప్పటికి నేను కవయిత్రి మొల్ల సినిమా చేశాను. ఆ సినిమాలో కలం పట్టుకుని కూర్చున్న స్టిల్ చూశారట... దాని గురించి అడిగారు. మిమ్మల్ని అలా కూర్చోమని ఎవరు చెప్పారు అని అన్నగారు నన్ను అడిగారు. లేదండి నేనే అలా బాగుంటుంది అని కూర్చున్నాను అని చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది ఆ స్టిల్, చాలా బాగా కూర్చున్నారు, ఆ కలం పట్టుకున్న తీరు చాలా బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు.'' అని వాణిశ్రీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
55
వాణిశ్రీని మెచ్చుకున్న ఇద్దరు హీరోలు
వాణిశ్రీ మాట్లాడుతూ.. ''నా కెరీర్ మొత్తంలో నన్ను మెచ్చుకున్న హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు అన్నగారు ఎన్టీఆర్, మరొకరు కృష్ణంరాజు గారు. వీరు తప్ప మరెవరు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్టీఆర్ కవయిత్రి మొల్ల పోస్టర్ చూసి మెచ్చుకుంటే... కృష్ణంరాజు మాత్రం నా చీర కట్టును మెచ్చుకున్నారు. మీరు చీరకట్టి కొంగు పైకి తీస్తారు కదా.. అప్పుడు ఓ రాయల్ లుక్ మీలో కనిపిస్తుంది అని ఓ సందర్భంలో అన్నారు. ఇక నాగేశ్వరావు గారు మాత్రం ఎప్పుడు ఏ విషయంలో కాంప్లిమెంట్ ఇవ్వలేదు. కృష్ణగారు అయితే అసలు మాటే మాట్లాడరు.. నేను హల్ అనను.. ఆయన హాయ్ అనరు.. షూటింగ్ లో ఎవరి పని వారు చేసుకుని వెళ్లిపోయేవారము '' అని అన్నారు వాణిశ్రీ.