చిత్ర పరిశ్రమలో కళాభినేత్రిగా లెజెండ్రీ నటి వాణిశ్రీ చెరగని ముద్ర వేశారు. సావిత్రి తర్వాత అప్పట్లో అంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. అందం అభినయం కలిగిన వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ లాంటి లెజెండ్స్ తో అలవోకగా నటించి మెప్పించారు. 400పైగా ఆమె చిత్రాలు చేశారు.