తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ. సావిత్రి ప్రభావం తగ్గుతున్న సమయంలో వాణిశ్రీకి క్రేజ్ పెరిగింది. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా స్టార్ హీరోలందరితో నటించింది. ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో వాణిశ్రీ తల్లి, అత్త తరహా పత్రాలు చేసింది.