జగన్ ప్రభుత్వంలో చిరు అవమానంకి, ఇది కదా ఫెరపెక్ట్ కౌంటర్

First Published Jun 20, 2024, 2:42 PM IST

 ఇది కేవ‌లం టీజ‌ర్ మాత్ర‌మే అని.. ఇంకా ట్రైల‌ర్‌, సినిమా ముందు ముందు చూసిస్తార‌ని మెగా అభిమానులు వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు.

Chiranjeevi, ys jagan


సినిమా వాళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం చూపించిన అమర్యాద, అవమానాలు ఇప్పుడు టాలీవుడ్ లోనూ , మెగాభిమానుల్లోనూ మరో సారి చర్చనీయాంశం అయ్యాయి.  గతంలో చిరంజీవి టాలీవుడ్ సమస్యలను విన్నవించేందుకు తోటి హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.  సినిమా టికెట్ రేటును 5 రూపాయలు చేశారు. దీంతో కొంత‌మంది సినిమా వాళ్ల‌తో క‌లిసి జ‌గ‌న్‌తో స‌మావేశ‌మైన చిరంజీవి చేతులు జోడించి మ‌రీ జ‌గ‌న్‌ను వేడుకున్నారు. పెద్ద‌మ‌నిషి హోదాలో ఉన్న త‌మ‌రు పెద్ద మ‌నసుతో ఆదుకోవాల‌ని చేతులు జోడించి మ‌రీ అడుగుతున్నాన‌ని చిరంజీవి అన్నారు. 

chiranjeev i


చిరంజీవి అంతటి సినిమా పెద్ద వెళ్లి అడిగినా జగన్ చలించలేదు. ఆయనకు అవమానం జరిగినట్లే అభిమానులు ఫీలయ్యారు.  తెలుగు సినీ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా ఉన్నారని కూడా చూడ‌కుండా ఇంటికి పిలిపించి మ‌రీ అవ‌మానించారు. అయినా సినిమా ఇండ‌స్ట్రీ కోసం ఆయ‌న అన్నీ భ‌రించారు.  ఆయన వయస్సు కన్నా గౌరవం ఇవ్వాలి కదా అని చాలా మంది వాపోయారు. . ఆ అవ‌మానంతో ర‌గిలిపోయిన ప‌వ‌న్ ఎన్నిక‌ల స‌మ‌రంలో జ‌గ‌న్‌ను పాతాళానికి తొక్కేశార‌నే చెప్పుకున్నారు. 
 

Latest Videos


chiranjeev i

 
ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో.. స్వయంగా మంత్రే చిరంజీవిని కలిసి టాలీవుడ్ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడంపై  తెలుగు సినిమా అభిమానులు ,మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రీఫీ మంత్రిగా ఇటీవల ఎంపికైన జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌ ఈ రోజు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ‘విశ్వంభర’ (Vishwambhara) సెట్స్‌కి వచ్చి చిరును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్‌ ఈ రోజు బాధ్యత స్వీకరణ చేయనున్న విషయం తెలిసిందే. 

chiranjeev i


 శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌కి విచ్చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు  చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆయన వచ్చిన సందర్భంగా ఆ ఫొటోలను ఎక్స్‌ వేదికగా చిరు పంచుకున్నారు.

chiranjeev i


‘మిత్రుడు కందుల దుర్గేశ్‌ (Kandula Durgesh) ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా శుభాకాంక్షలు. ‘విశ్వంభర’ (Vishwambhara) సెట్స్‌లో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటోన్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటాను’ అని దుర్గేశ్ చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.  ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థలాల్ని పర్యటక శాఖ మంత్రిగా పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నా.. విశ్వసిస్తున్నా’ అని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు. 

chiranjeev i

 
ఈసందర్భంగా ‘విశ్వంభర’ సెట్‌లో ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. అందులో చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు మూవీ యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
 

chiranjeev i


ఇక రీసెంట్ గా  జరిగిన ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని స్టేట్‌ గెస్ట్‌గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం, ఆయన వెళ్లడం మీకు తెలిసిందే. ఆ తర్వాత స్టేజీ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చిరంజీవి, పవన్‌తో (Pawan Kalyan) చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేయడం కూడా చూసే ఉంటారు. 

Chiranjeevi


ఏపీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం త‌ర్వాత ఇంటికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చిరంజీవి కుటుంబం ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఈ సంద‌ర్భంగా అన్న‌య్యకు ప‌వ‌న్ పాదాభివందనం చేయ‌డం ఆక‌ట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అన్న‌య్య‌ను అవ‌మానించిన వాళ్ల ఆట క‌ట్టించిన త‌మ్ముడు.. ఇప్పుడు స‌గ‌ర్వంగా ఆయ‌న ముందు నిల్చున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది కేవ‌లం టీజ‌ర్ మాత్ర‌మే అని.. ఇంకా ట్రైల‌ర్‌, సినిమా ముందు ముందు చూసిస్తార‌ని అభిమానులు వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు.

click me!