వాణీ జయరామ్ తెలుగు సూపర్ హిట్ సాంగ్స్.. కె విశ్వనాథ్ చిత్రాలతోనే రెండు జాతీయ అవార్డులు

First Published Feb 4, 2023, 4:32 PM IST

మధుర గాయని వాణీ జయరామ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమని, అభిమానులు దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. నేడు శనివారం ఆమె చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 

మధుర గాయని వాణీ జయరామ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమని, అభిమానులు దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. నేడు శనివారం ఆమె చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వాణీ జయరామ్ చిత్ర పరిశ్రమకి, సంగీతానికి చేసిన సేవలు గుర్తిస్తూ పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించింది. అంతలోనే ఆమె మరణించి తీరని వేదన మిగిల్చారు. 

తెలుగు, తమిళంఎం మలయాళం, కన్నడ, హిందీ తో పాటు గుజరాతి, భోజ్ పురి భాషల్లో కూడా ఆమె ఎన్నో పాటలు పాడారు. తెలుగులో ఆమె గాత్రం నుంచి జాలువారిన మధురమైన పాటలు ఇప్పటికీ అభిమానులని అలరిస్తూనే ఉంటాయి. 1974లో ఎన్టీఆర్ దీక్ష చిత్రంతో ఆమె పాటల ప్రవాహం మొదలయింది. ఆ చిత్రంలో పెండ్యాల నాగేశ్వర రావు సంగీతంలో వాణీ జయరామ్ ' రాక రాక వచ్చావు మావ' అనే పాట పాడారు. ఆ తర్వాత ఆమెకి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. 

Vani jayaram

1975లో ఆమె పూజ చిత్రంలో నాలుగు పాటలు పాడారు. అందులో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలసి ఆమె పాడిన 'ఎన్నెన్నో జన్మల బంధం సాంగ్ ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత నుంచి ఆమెకి ఎమ్మెస్ విశ్వనాథ్, కెవి మహదేవన్, ఇళయరాజా లాంటి సంగీత దర్శకులు తమ చిత్రాల్లో పాటలు పాడించడం మొదలు పెట్టారు. 

Vani jayaram

ఇక శంకరాభరణం చిత్రంలో బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ మానస సంచరరే,పలుకే బంగారమాయేనా , యేతీరుగా నను లాంటి క్లాసికల్ సాంగ్స్ పాడారు. ఈ చిత్రానికి ఆమెకి బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని ఇటీవల మరణించిన కె విశ్వనాథ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వర్ణకమలం, స్వాతి కిరణం లాంటి విశ్వనాథ్ గారి చిత్రాలకు కూడా ఆమె పాటలు పాడారు. 

స్వర్ణకమలం చిత్రంలో 'అందెల రవమిది' అనే సాంగ్ పాడారు. స్వాతి కిరణం చిత్రంలో ప్రతి పాట ఆణిముత్యమే అని చెప్పాలి. ఈ చిత్రంలోని 'తెలి మంచు కరిగింది' అనే సూపర్ హిట్ సాంగ్ పడింది వాణీ జయరామే. ఈ చిత్రంలో ఆమె పాడిన 'ఆనతీయరా హరా' అనే పాటకి గాను ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకి సాహిత్యం అందించారు. కె విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ.. వాణీ జయరామ్ తనకి ఎలా కావాలో అలా ఈ పాటని పాడింది అని ప్రశంసించారు. 

Vani jayaram

సీతా కొక చిలుక ఆమె గాత్రం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ చిత్రంలో 'మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా, సాగర సంగమమే, అలలు కలలు లాంటి అద్భుతమైన ఎవర్ గ్రీన్ సాంగ్స్ పాడారు. 

click me!