అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ ఎన్టీఆర్, సమీరా రెడ్డి గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి.