సీన్ రివర్స్.. వకీల్ సాబ్ విషయంలో సీఎం జగన్ కి నాగబాబు మద్దతు!

First Published Apr 12, 2021, 7:51 AM IST


పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ఫ్యాన్స్ తప్పుబట్టారు. వకీల్ సాబ్ సినిమాకు బెనిఫిట్ షోస్ నిరాకరించడంతో పాటు, టికెట్స్ ధరలు పెంచడానికి వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వకీల్ సాబ్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే ఈ నిర్ణయాలు పవన్ పై జగన్ రాజకీయ కుట్రే అంటూ అభిమానులు, బీజేపీ, జనసేన నాయకులు విమర్శలు చేశారు. ఈ విషయంలో రాజకీయంగా తీవ్ర చర్చ నడిచింది. సినిమా వేరు రాజకీయాలు వేరు, జగన్ ప్రభుత్వ నిర్ణయాలు సమంజసం కాదని కొందరు అన్నారు .
undefined
ఈ విషయంలో వైసీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాలు సమర్ధించుకున్నారు. నిబంధనల ప్రకారమే బెనిఫిట్ షోలు రద్దు, టికెట్స్ ధరల నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కోర్ట్ ల వరకూ వెళ్లిన ఈ వివాదం కొనసాగుతుంది.
undefined
అయితే మొదటిసారి ఈ విషయంపై నాగబాబు స్పందించారు. వకీల్ సాబ్ మూవీ టికెట్స్ ధరలు, బెనిఫిట్   షోలకు   అనుమతుల నిరాకరణ వంటి నిర్ణయాలు జగన్ వి కాదని ఆయన అన్నా
undefined
పరిపాలనలో బిజీగా ఉన్న జగన్ కి ఈ విషయాలు ఏవీ తెలియకపోవచ్చని, ఆయన చుట్టూ ఉన్న నాయకులు, మంత్రులు వకీల్ సాబ్ చిత్రంపై కుట్ర పన్నుతున్నారని అన్నారు.
undefined
ఏ కొంచెం అవకాశం దొరికినా జగన్ పై పరోక్ష విమర్శలు చేసే నాగబాబు, జగన్ కి మద్దతుగా మాట్లాడడం, జన సైనికులకు మతిపోయినంత పనైంది.  సడన్ గా నాగబాబు ఏంటి ఇలా ప్లేట్ మార్చారని అనుకుంటున్నారు.
undefined
వకీల్ సాబ్ మూవీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ నడుస్తుండగా, ఏపీ సీఎం జగన్ కి అసలు ఏమి తెలియదని, జరుగుతున్న పరిణామాలకు ఆయనకు సంబంధం లేదని అనడం హాస్యాస్పదం అని వారు అంటున్నారు.
undefined
click me!