ఈ ఫొటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, గుర్తుపట్టారా?

First Published Apr 11, 2021, 4:58 PM IST

హ్యాపీ సిబ్లింగ్స్ డే అంటూ చిన్ననాటి ఫోటో పంచుకుంది ఒకప్పటి క్యూట్ హీరోయిన్. చూడడానికి ఆపిల్ పండులా ఉండే ఈ చిన్నది, పరిశ్రమలో బడా బడా హీరోల సరసన నటించారు. 
 

కొన్నాళ్ల క్రితం నటనకు గుడ్ బై చెప్పిన ఈ హీరోయిన్, నిర్మాతగా మారారు. ఏకంగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు.
undefined
పాలుగారే బుగ్గలతో అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు మన ఛార్మి. తన బ్రదర్ మిక్కీ ఉప్పల్ తో కలిసి దిగిన ఫోటో పంచుకున్న ఛార్మి, అతనికి హ్యాపీ సిబ్లింగ్స్ డే విషెష్ తెలియజేశారు.
undefined
13ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది ఛార్మి. 2002లో విడుదలైన నీతోడు కావాలి ఆమె మొదటి చిత్రం.
undefined
నాగార్జున హీరోగా దర్శకుడు లారెన్స్ తెరకెక్కించిన మాస్ ఛార్మికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
undefined
రాఖీ మూవీలో ఎన్టీఆర్, లక్ష్మీ చిత్రంలో వెంకటేష్ లతో పాటు పౌర్ణమి మూవీలో ప్రభాస్ కి జంటగా ఆమె నటించారు.
undefined
ఇక దర్శకుడు పూరి జగన్నాధ్ కాంపౌండ్ లో అడుగుపెట్టిన ఛార్మి జ్యోతి లక్ష్మీ అనే బోల్డ్ మూవీ చేశారు. మంత్ర, అనగనగా ఒకరోజు, మంత్రం 2 ఛార్మి సోలోగా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.
undefined
2015లో నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి... దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లో వచ్చిన జ్యోతి లక్ష్మీ, మెహబూబ, పైసా వసూల్, రోగ్ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి.
undefined
దీనితో సంపాదించుకున్న కొంచెం డబ్బులు ఆవిరైపోయాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ ఇల్లు, పొలాలు కూడా అమ్ముకొని ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోయారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కి అవకాశాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.
undefined
పోయిన చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతం బాగా తెలిసిన పూరి జగన్నాధ్, డబ్బులు కూడగట్టుకొని, చివరి ప్రయత్నంగా హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ గా ఇస్మార్ శంకర్ రూ. 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
undefined
ఇస్మార్ట్ శంకర్ మూవీ పూరి, ఛార్మిలకు లాభాలు పంచగా, తిరిగి పుంజుకున్నారు. మరలా ఇల్లు, కార్లు కొనుక్కున్నారు. దానికి తోడు విజయ్ దేవరకొండ లాంటి స్టార్ తో మూవీ ఓకె కావడం మరో కలిసొచ్చిన అంశము.
undefined
లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా పూరి, ఛార్మిలతో పాటు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ మూవీ విజయం సాధిస్తే పూరి, ఛార్మి పంట పండినట్లే.
undefined
ఛార్మి ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
ఛార్మి ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
ఛార్మి ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
ఛార్మి ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
ఛార్మి ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
click me!