పవిత్ర లోకేష్‌ ముందే ఎమోషనలైన నరేష్‌.. కృష్ణ ఫోటో పట్టుకుని హ్యాపీగా లేనంటూ స్టేజ్‌పైనే భావోద్వేగం

Aithagoni Raju | Updated : Sep 18 2023, 10:10 AM IST
Google News Follow Us

పవిత్ర లోకేష్‌, నరేష్‌ ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంటగా నిలిచింది. ఆ మధ్య హాట్‌ టాపిక్‌గా మారిన ఈ జంట ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. ఇందులో నరేష్‌ ఎమోషనల్‌ కావడం మరింత చర్చనీయాంశం అవుతుంది. 
 

16
పవిత్ర లోకేష్‌ ముందే ఎమోషనలైన నరేష్‌.. కృష్ణ ఫోటో పట్టుకుని హ్యాపీగా లేనంటూ స్టేజ్‌పైనే భావోద్వేగం

నరేష్‌, పవిత్ర లోకేష్‌ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆ విషయాన్ని చాలా సందర్బాల్లో నిరూపించారు. ఎక్కడ చూసినా కలిసే తిరుగుతున్నారు. మరోవైపు ఇద్దరు కలిసి `మళ్లీ పెళ్లి` అనే సినిమా కూడా చేశారు. ఇందులో తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో తెలిపారు. తాము కలవడంలో తప్పు లేదని, బలమైన కారణాలతోనే తాము దగ్గరయ్యామని, తమకు తోడు కావాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు. 
 

26

నరేష్‌ తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి చాలా ఒత్తిడి ఫేస్‌ చేశాడు. వీరిది వివాహ బందం చాలా వివాదాస్పదంగా మారింది. నరేష్‌ని ఆమె వదిలేసి వెళ్లిపోయిందని, తాను డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని నరేష్‌ ఆరోపిస్తున్నారు. కానీ తనే వారసురాలుని అని, విజయనిర్మల చెప్పినట్టు రమ్య రఘుపతి చెబుతుంది. అయితే వీరిద్దరి విడాకుల మ్యాటర్‌ కోర్ట్ లో ఉంది. కోర్ట్ నుంచి విడాకులు రాలేదు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. 
 

36

కానీ ఇటీవల ఈ ఇద్దరు సైలెంట్‌ అయ్యారు.నరేష్‌ కూడా బయట హడావుడి చేయడం తగ్గించారు. అక్కడ ఆమె కూడా సైలెంట్ అయ్యింది. మరోవైపు నరేష్‌, పవిత్రలోకేష్‌ కలిసే ఉంటున్నారట. నరేష్‌కి, అటు పవిత్ర లోకేష్‌కి కూడా తమ పార్టనర్స్ నుంచి విడాకులు రాకపోవడంతో సహజీవనం కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు చాలా రోజుల తర్వాత బయటకొచ్చారు. ఓ టీవీ షోలో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్బంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌కి నరేష్‌, పవిత్ర కలిసి హాజరయ్యారు. 

Related Articles

46

ఇందులో నరేష్‌  ఎమోషనల్‌ అవడం విశేషం. మొదట ఈ జంటపై హైపర్‌ ఆది, చిన్న నరేష్‌, రామ్‌ ప్రసాద్‌లు సెటైర్లు పేల్చారు. స్కిట్లు ప్రదర్శించి నవ్వులు పూయించారు. అయితే నరేష్‌ చిత్ర పరిశ్రమలో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీవీ షో నిర్వహకులు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా నరేష్‌ ఎమోనల్‌ అయ్యారు. పవిత్ర లోకేష్‌ ముందే ఆయన కంటతడి పెట్టుకున్నంత పని చేశాడు. 
 

56

నరేష్‌ తనని సన్మానించే టైమ్‌లో ఆయన సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫోటోని చూపించడం విశేషం. అనంతరం మాట్లాడుతూ, యాభై ఏళ్లు అయిపోయింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో రకరకాల ఒడిదొడుకులు ఫేస్‌ చేసినట్టు చెప్పాడు. ఆ విషయంలో తాను సంతోషంగా లేదనని, ఇప్పటికీ బాధపడుతున్నట్టు తెలిపారు నరేష్‌. ఈ సందర్భంగా ఆయన తన మ్యారేజ్‌ లైఫ్‌ గురించి తలుచుకుని బాధపడుతున్నట్టు తెలుస్తుంది. 

66

నరేష్‌కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురితో విడిపోయారు. అందులో ఒకరు మరణించినట్టు సమాచారం. ఓ రకంగా నరేష్‌ తన మ్యారేజ్‌ లైఫ్‌లో సంతోషంగా లేడు. ఆ విషయాన్ని పదే పదే పలు ఇంటర్యూల్లో తెలిపారు. `మళ్లీ పెళ్లి` చిత్రంలోనూ చూపించారు. బలమైన పార్టనర్‌ కోసం ఇన్నాల్లు చూశానని, పవిత్ర రూపంలో తనకు తోడు దొరికిందని తాను భావిస్తున్నట్టు నరేష్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఇక నటుడిగా నరేష్‌ బిజీగా ఉన్నాడు. నాలుగైదు సినిమాలు చేస్తూ మంచి నటుడిగా రాణిస్తున్నారు.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos