అవార్డుల అందుకున్న ఆనందంలో రెట్టింపైన అందాలు... టైట్ డ్రెస్ లో కవ్విస్తున్న మృణాల్ గ్లామర్!

Published : Sep 17, 2023, 08:22 PM ISTUpdated : Sep 17, 2023, 08:23 PM IST

సైమా అవార్డ్స్ కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్ తన ఆనందం సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవార్డ్స్ పట్టుకొని కెమెరాకు పోజిచ్చారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
16
అవార్డుల అందుకున్న ఆనందంలో రెట్టింపైన అందాలు... టైట్ డ్రెస్ లో కవ్విస్తున్న మృణాల్ గ్లామర్!
Mrunal Thakur

దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. సీతారామం చిత్రానికి గానూ మృణాల్ ఠాకూర్ రెండు అవార్డ్స్ కొల్లగొట్టింది. బెస్ట్ ఫిమేల్ డెబ్యూ, క్రిటిక్స్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ విభాగాల్లో ఆమెకు అవార్డ్స్ గెలుచుకున్నారు. 

26
Mrunal Thakur

ఈ క్రమంలో సీతారామం చిత్ర యూనిట్ కి, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తన ఆనందం అభిమానులతో పంచుకున్నారు. ఇక సైమా అవార్డ్స్ వేడుకకు టైట్ బాడీ కాన్ డ్రెస్ లో మృణాల్ హాజరైంది. అవార్డు గెలిచిన ఆనందంలో ఆమె అందాలు రెట్టింపు అయ్యాయి. 

 

36
Mrunal Thakur

దర్శకుడు హను రాఘవపూడి మృణాల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాతలకు భారీ లాభాలు పంచింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. సీత పాత్రలో మృణాల్ మైమరిపించింది. మృణాల్ కి సీతారామం మూవీ భారీ ఫేమ్ తెచ్చింది. అందుకే తెలుగులో వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. 

46
Mrunal Thakur


ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి (Nani) జంటగా హాయ్ నాన్న టైటిల్ తో ఒక మూవీ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.  హాయ్ నాన్న డిసెంబర్ 21న విడుదల కానుంది. ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. 
 

56
Mrunal Thakur

అలాగే విజయ్ దేవరకొండతో మరొక చిత్రం ప్రకటించారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) 13వ చిత్రంగా తెరకెక్కుతుండగా దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. తాజాగా షూటింగ్ మొదలైంది. 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

66
Mrunal Thakur

కాగా మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యారు.మరాఠీ చిత్రం విట్టి దండు తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది. అనంతరం సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీ రాబట్టారు. ఇక అనేక అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మృణాల్ ఠాకూర్ చెబుతారు. సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నం చేసే రోజుల్లో కొందరు కించపరిచారట. తాను బాడీ షేమింగ్ కి గురి చేశారట. 

click me!

Recommended Stories