Ustaad bhagat Singh Glimpse: గబ్బర్‌ సింగ్‌ రోజులు గుర్తు చేసిన పవన్‌.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌

Published : Mar 07, 2026, 08:55 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ నుంచి ట్రైలర్‌ గ్లింప్స్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ మార్క్ స్టయిలీష్‌గా, పవర్ ఫుల్‌ గా సాగిన ఈ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. 

PREV
15
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ గ్లింప్స్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ రూపొందింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ఈ నెల 19న విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ని షురూ చేసింది టీమ్‌. ఈ చిత్రానికి డీఎస్‌పీ సంగీతం అందిస్తుండగా, థమన్‌ బీజీఎం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మూవీ నుంచి గ్లింప్స్ వచ్చింది. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ట్రైలర్‌ టీజ్‌ పేరుతో దీన్ని విడుదల చేశారు.

25
ఇది భగత్‌ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు

గ్లింప్స్ చూస్తే, ఫారెస్ట్ లో పోలీస్‌ అధికారిగా తన జీప్‌పై ఎంట్రీ ఇచ్చాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ క్రమంలో భగవద్గీతలోని శ్లోకం వినిపిస్తుంది. ఇంతలోనే ప్రత్యర్థులను ఆడుకుంటాడు పవన్‌. తనదైన యాక్షన్‌తో రెచ్చిపోయాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ సందర్భంగా ఆయన డైలాగ్‌ చెబుతూ, `ఇందాక మీరు విన్నది భగవద్గీత.. ఇది భగత్‌ గీత, దమ్మున్నోడు దాటొచ్చు` అని పవన్‌.. పోలీస్‌స్టేషన్‌లో గీత గీస్తాడు. అనంతరం విలన్లని చితక్కొడతాడు.

35
కౌబాయ్‌ గెటప్‌లో అదరగొడుతున్న పవన్‌

ఇక ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కౌబాయ్‌ గెటప్‌లో కనిపించారు. ఆయన హ్యాట్‌ పెట్టుకుని, కౌబాయ్‌ డ్రెస్‌లో అదిరిపోయేలా ఉన్నారు. స్టయిలీష్‌గా ఉన్నాడు. అభిమానులు కోరుకున్నట్టుగా పవన్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉండటం విశేషం. అయితే పవన్‌ మ్యానరిజం, డైలాగ్‌ డెలివరీ, ఆయనలోని ఎనర్జీ చూస్తుంటే `గబ్బర్‌ సింగ్‌` రోజులను గుర్తు చేస్తుంది. అభిమానులను ఖుషీ చేస్తోంది. మరి మరోసారి `గబ్బర్‌ సింగ్‌` మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా? అనేది చూడాలి.

45
`గబ్బర్‌ సింగ్‌` తర్వాత పవన్‌, హరీష్‌ కాంబోలో మూవీ

'గబ్బర్ సింగ్' తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. పవర్‌ ఫుల్‌ డైలాగులు పూనకాలు తెప్పించాయి. 

55
త్వరలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌

తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా ఆకట్టుకోవడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి  నిర్మిస్తున్నారు. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వారం ముందుగానే `ఉగాది` పండగ సందర్భంగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. దీంతో అభిమానులు సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories