Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే

Published : Mar 07, 2026, 07:57 PM IST

Mad for Each Other: బిగ్‌ బాస్‌ షో బుల్లితెరపై మంచి ఆదరణ పొందుతూ వస్తోంది. కానీ ఇప్పుడు దాన్ని తలదన్నే షో వస్తుంది. మంచి మసాలా లాంటి షో రాబోతుంది. లవర్స్ కి మాత్రం పండగే అని చెప్పొచ్చు. 

PREV
16
బిగ్‌ బాస్‌ ని మించేలా క్రేజీ షో

బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షోకి బుల్లితెరపై మంచి ఆదరణ లభిస్తుంది. బాగా పాపులర్‌ అయ్యింది. అత్యంత చర్చనీయాంశంగా మారిన షో ఇది. ప్రతి ఏడాది 105 రోజులు బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఎంగేజ్‌ చేస్తుంది. టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అవుతుంది. దీని చుట్టూ చాలా కంటెంట్‌ క్రియేట్‌ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని దెబ్బకొట్టే షో వస్తోంది. లవర్స్ షో వస్తోంది. `మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌` అనే షో రాబోతుంది.

26
శ్రీముఖి హోస్ట్ గా మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ షో

శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షో జీయో హాట్‌ స్టార్‌లో  రాబోతుంది. స్టార్‌ మాలో టెలికాస్ట్ కానుంది. ఇందులో పది సెలబ్రిటీ జంటలను ఒక ఇంట్లో ఉంచుతారు. వారి రిలేషన్‌ ఎంత స్ట్రాంగ్‌ అనేది, ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం ఉందనేది, తమ రిలేషన్‌ని నిలబెట్టుకునేందుకు వాళ్లు ఏం చేస్తారు? తమ వారికోసం ఎలా పోరాడతారు? అసలు పది జంటలు ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు? ఎలా సర్వైవ్‌ అవుతారు? వారి రిలేషన్‌ లోని నిజాయితీ ఎంత? అనేది ఆవిష్కరించే విధంగా ఈ `మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌` షో ఉండనుంది.

36
పది జంటలు వీరే

ఇందులో స్టార్‌ మా సీరియల్స్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు.  శివ-ప్రియాంక జైన్‌, నూకరాజు-ఆసియా, వసంతి-కళ్యాణ్‌, జాను-భాను, బింటూ-సంధ్య, సోనియా-సిద్దు, సాండ్రా-మహేష్‌, నీతూ-నటరాజ్‌, హరిత-హరీష్‌, అంజలి-పవన్‌ వీరంతా జంటలుగా `మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌` షోకి వచ్చారు. ఈ పది జంటలు పదివారాల పాటు హౌజ్‌లో ఉండబోతున్నారు. వీరిలో చివరి వరకు ఏ జంట నిలబడుతుంది? టైటిల్‌ విన్‌ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

46
మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ షో జడ్జ్ లు వీరే

అయితే ఈ షో మార్చి 15న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. దీనికి దర్శకుడు అనిల్‌ రావిపూడి, సీనియర్‌ నటీమణులు లయ, రాధా జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇరవై మంది(పది జంటలు) లవర్స్ కలిసి ఒకే ఇంట్లో ఉంటే వాళ్లు చేసే రచ్చ, వాళ్ల మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. చూసే ఆడియెన్స్ కి కావాల్సిన మసాలా కంటెంట్‌ గట్టిగానే వస్తుందని చెప్పొచ్చు. ఇక లవర్స్ కి అయితే పండగే అని చెప్పొచ్చు. వాళ్లకి కావాల్సిన స్టఫ్‌ గట్టిగానే దొరుకుతుందని చెప్పొచ్చు.

56
కొంపలో కుంపటి అంటూ సెటైర్లు

అయితే ఈ షో ప్రోమో కి నెటిజన్లు రియాక్ట్ అవుతూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కొంపలో కుంపటి అని, ఇది లవర్స్ ని విడగొట్టే షో అని, వీరు పది వారాలు కలిసి ఉండటం కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు, ఈ జంటలు బెస్ట్ అని, ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారని, ఒకరికొకరు లైఫ్‌ ఇచ్చుకున్నారని అంటున్నారు. అదే సమయంలో కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్లని తీసుకొస్తే బాగుండేది. వాళ్ల అనుభవాలు చెబుతారని అంటున్నారు. 

66
బిగ్‌ బాస్‌ షోకి దెబ్బ తప్పదా?

మొత్తంగా ఈ షో ఆద్యంతం రసవత్తరంగా ఉండబోతుందని, లవర్స్ మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ షో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. అయితే ఇదే క్లిక్ అయితే బిగ్‌ బాస్‌ షోకి పెద్ద దెబ్బగా మారబోతుందని చెప్పొచ్చు. లవర్స్ ఇచ్చే కంటెంట్‌ సింగిల్స్ ఇవ్వలేదు. అది బిగ్‌ బాస్‌ షోకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories