‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ 45 డేస్ షెడ్యూల్ ఇదే.!

Published : Aug 21, 2023, 01:31 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పున: ప్రారంభం అయ్యింది. పవర్ స్టార్ ఎట్టకేళలకు తిరిగి సెట్స్ లో అడుగుపెట్టారు. అటు ‘ఓజీ’ మూవీతో కలిపి పవన్ కళ్యాణ్ నెలన్నర పాటు డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.   

PREV
16
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ 45 డేస్ షెడ్యూల్ ఇదే.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఇటు సినిమాలు, అటు పొలిటికల్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏమాత్రం సమయం వృథా చేయకుండా శ్రమిస్తున్నారు. మొన్నటి వరకు పొలిటికల్ ప్రొగ్రామ్స్ తో బిజీగా ఉన్న పవన్ మళ్లీ తన లైనప్ లోని సినిమాపై ఫోకస్ పెట్టారు. 
 

26

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో మెస్ట్ అవైటెడ్ గా ఫిల్మ్స్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలు ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh)  సెట్స్ లో అడుగుపెట్టారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న యూనిట్ ఈరోజు నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రారంభించింది. 
 

36

అయితే, ఈ రోజు నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు పవన్ కళ్యాణ్ 15 రోజులు డేట్స్ ను ఇచ్చారు. ఈ షెడ్యూల్ లోనే పవర్ స్టార్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతోంది. 

46

ఈ సందర్బంగా సెట్స్ లోంచి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫొటో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఖాకీ దుస్తుల్లో పవన్ పవర్ ఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి వరుసగా అప్డేట్స్ అందించేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది. 

56

పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రెండోసారి వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 

66

ఇక 15రోజుల షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్ 30 డేస్ ‘ఓజీ’ షూటింగ్ కోసం సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. OG నెక్ట్స్ షెడ్యూల్ బ్యాంకాక్ లో జరుగనుంది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత కేవలం ఫారేన్ షెడ్యూల్ మాత్రమే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం 45 రోజుల పాటు పవన్ ఈ రెండు చిత్రాలకు సమయం కేటాయించారని తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories