Ustaad Bhagat Singh Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం.. మైనస్‌ ఏంటంటే?

Published : Mar 17, 2026, 10:28 AM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది. పవర్‌ స్టార్‌ వన్‌ మ్యాన్‌ షో చేశారట. అదే సమయంలో మైనస్‌లు కూడా వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే? 

PREV
17
ఉగాది సందర్భంగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో రాబోతున్నారు. మరో రెండు రోజుల్లో(మార్చి 19న) ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసేందుకు వస్తోంది. మొన్న ట్రైలర్‌, ఆ తర్వాత ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో మూవీకి మంచి బజ్‌ ఏర్పడింది. అంతకు ముందు బజ్‌ పెద్దగా లేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా వస్తుందంటే ఆ హడావుడి, అభిమానుల హంగామా వేరేలా ఉంటుంది, కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం సీన్‌ రివర్స్ లా ఉండింది. ఇంతగా బజ్‌ లేని పవన్‌ సినిమా ఇదే అని ప్రచారం జరిగింది.

27
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌పై బజ్‌ క్రియేట్‌ చేసిన ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఇప్పుడు మంచి బజ్‌ ఏర్పడిందని చెప్పొచ్చు. టీమ్‌ గట్టిగా బజ్‌ని క్రియేట్‌ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్‌ అయ్యాయి. దీనికి రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. టీమ్‌ చెప్పినదాని ప్రకారం, సినిమా చూసిన వారి అభిప్రాయం ప్రకారం మూవీ అదిరిపోయిందంటున్నారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ మూవీ అని, వింటేజ్‌ పవన్‌ కళ్యాణ్‌ని చూస్తారని అంటున్నారు.

37
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఫస్ట్ రివ్యూ

పవన్‌ కళ్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షో చూస్తారని, మాస్‌ లుక్‌లో ఆయన అదరగొట్టాడని అంటున్నారు. యాక్షన్‌, మాస్‌ డైలాగ్‌లే కాదు, కామెడీ కూడా అదిరిపోతుందట. పవన్‌ ఇందులో కామెడీ బాగా చేశాడని, డాన్సుల కోసం కూడా బాగా కష్టపడ్డాడని అంటున్నారు. రొమాంటిక్‌ సీన్లు కూడా బాగుంటాయి. ముఖ్యంగా పవన్‌, శ్రీలీల మధ్య వచ్చే సీన్లు యూత్‌ని ఆకట్టుకుంటాయని, రాశీఖన్నాతో సాంగ్‌లో వేసిన డాన్స్ ఆడియెన్స్ చేత స్టెప్పులు వేయించేలా ఉంటుందట.

47
పవన్‌ కళ్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షో

సినిమాలో హై ఇచ్చే సీన్లు చాలా ఉన్నాయట. ఎక్కడైతే లో అవుతుందో, వెంటనే హై ఇచ్చే సీన్లు పడ్డాయని, దీంతో మూవీ వేరే స్థాయికి వెళ్తుందని చెబుతున్నారు. పవన్ ఎంట్రీ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా డిజైన్ చేశారట. పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయని,  ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. సినిమాలో ఉన్న రెండు మాస్ సాంగ్స్ థియేటర్లను షేక్ చేస్తాయంటున్నారు. డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్టైలే వేరు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషన్స్, వినోదాన్ని మేళవించి కథను ఆసక్తికరంగా మలిచారని టాక్‌. పవన్ కళ్యాణ్ వర్సటైల్ యాక్టింగ్‌ను పూర్తిస్థాయిలో వాడుకుంటూ, ఈ సినిమాను ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని, మొత్తానికి, 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించే మూవీ అవుతుందంటున్నారు.

57
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌పై దేవిశ్రీ ప్రసాద్‌ రివ్యూ

దీనిపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా తన రివ్యూ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ పర్‌ఫెర్మెన్స్ బద్దలవుతుందని, ఆయన ఇందులో అన్నీ చేశారని, క్లైమాక్స్ వరకు ఒక లెక్క, క్లైమాక్స్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంటుందన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ దీనికి సంగీతం అందించారు. థమన్‌ బీజీఎం చేశారు. బీజీఎం దుమ్ములేచేలా ఉంటుందని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని ఇటీవల హరీష్‌ చెప్పారు.

67
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌పై ఓవర్సీస్‌ క్రిటిక్‌ రివ్యూ

మరోవైపు ఈ మూవీపై ఓవర్సీస్‌ క్రిటిక్స్ గా భావించే ఉమైర్‌ సందు  తన రివ్యూ ఇచ్చాడు. ఇది పవన్‌ కళ్యాణ్‌ రైడ్‌ అని, ఇందులో ఆయనే బిగ్‌ బాస్‌ అని చెప్పాడు. ఆయనలా మరెవ్వరూ చేయలేరని, ఆయన షోని దొంగిలించాడని, సినిమా మొత్తం తన భుజాలపై నడపించాడని చెప్పాడు. అలాగే శ్రీలీలా చాలా హాట్‌గా ఉందని, సినిమా మంచి మాస్‌ మసాలా ఫిల్మ్ అని, జనాలతో థియేటర్లు నిండిపోతుందని చెప్పారు. అంతేకాదు ఆయన ఈ మూవీకి ఏకంగా నాలుగు రేటింగ్‌ ఇవ్వడం విశేషం. మరి ఆయన చెప్పినదాంట్లో నిజం ఎంత అనేది చూడాలి.

77
ఉస్తాద్‌ భగత్ సింగ్‌లో మైనస్‌ ఏంటంటే?

ఇదిలా ఉంటే ఈ మూవీలో కొన్ని మైనస్‌లు వినిపిస్తున్నాయి. మాస్‌ కమర్షియల్‌ మూవీ అనేసరికి కొంత రొటీన్‌ ఫీలింగ్‌ అనిపిస్తుందట. రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో మూవీ ఉంటుందట. పాటలు సరిగా లేవు. ఒక్కటి కూడా  మళ్లీ మళ్లీ వినేలా లేవు, ఏమాత్రం ఆసక్తిని పెంచేలా లేవు. అదే సమయంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ఆడియెన్స్ లో నమ్మకం తగ్గింది. ఆయన చివరగా తీసిన `గద్దల కొండ గణేష్‌` యావరేజ్‌గా ఆడింది. `మిస్టర్‌ బచ్చన్‌` డిజాస్టర్‌ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ ప్రభావం `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`పై పడింది. అది కూడా ఈ మూవీకి బజ్‌ లేకపోవడానికి కారణమని చెప్పొచ్చు. మరి హరీష్‌ రెగ్యూలర్‌ మూసలోకే వెళ్తాడా? ఈ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తాడా అనేది చూడాలి. ఆయన మాత్రం ఇది మరో `గబ్బర్‌ సింగ్‌` అవుతుందని చెప్పడం విశేషం. యూ ఏ సర్టిఫికేట్‌ పొందిన ఈ మూవీ రెండున్నరగంటల నిడివితో ఉంటుందట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories