కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 17వ తేదీ)లో కార్తీక్‍తో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్న దీప. కూతురి కోసం హోమం చేయనున్న దశరథ. కార్తీక్, దీపలను రిక్వెస్ట్ చేసిన శివన్నారాయణ. దాసుకు షాక్ ఇచ్చిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో మనం బిడ్డను వదులకుంటున్నామనే వీళ్లకు తెలుసు. కానీ ఎందుకు వదులుకుంటున్నామో తెలియదు. ఇప్పుడు కారణం చెప్పే పరిస్థతిలో మనం లేము. ఒక వేళ నిజం చెప్పిన అత్త తట్టుకోలేదు అంటాడు కార్తీక్. కానీ అత్త నీ గురించి తప్పుగా అనుకుంటోంది కదా అంటుంది దీప.
ఎవరు ఏమైనా అనుకోని మనం తీసుకున్న నిర్ణయం మీద మనం నిలబడదాం. ఒకవేళ దీని గురించి నాకు తెలియదు అని నేను తప్పుకుంటే.. జ్యోత్స్న, పారు కలిసి నిన్ను మాటలతోనే చంపేసేవారు. అందుకే నేను గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఏం జరిగినా సరే నీకు తోడుగా నేను ఉంటా అంటాడు కార్తీక్. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది బావ అని కార్తీక్ ని హత్తుకుంటుంది దీప.
25
కూతురి కోసం హోమం
మరోవైపు గురువు గారు చెప్పిన మాటలకు బాధపడుతుంటాడు దశరథ. నాకు ఏదో ఒక మార్గం చూపించండి గురువు గారు.. నేను జరిగే దాన్ని అడ్డుకోలేకపోతున్నాను, మార్చలేకపోతున్నాను, మానసికంగా కూడా ఒప్పుకోలేకపోతున్నాను. నేను ఎవ్వరి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. నా కూతురు, తన కడుపులో బిడ్డ, నా భార్య ముగ్గురు బ్రతకాలి.. మార్గం చూపించండి అని గురువును వేడుకుంటాడు దశరథ. అయితే హోమం చేయమని చెప్తాడు గురువు. మీరు అన్నీ సిద్ధం చేయండని చెప్పి వెళ్లిపోతాడు దశరథ.
35
ఒకే మాటపై స్వప్న, కాశీ
దీప, కార్తీక్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసి షాక్ అవుతుంది కావేరి. దీపకు మతి పోయిందా? బిడ్డను వద్దనుకోవడం ఏంటీ? కార్తీక్ భార్యను మందలించకుండా సపోర్ట్ చేయడం ఏంటి అని అంటుంది కావేరి. అన్నయ్య ఒక పని చేశాడంటే అందులో ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. వాళ్లకు పిల్లలంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. అలాంటి వాళ్లు బిడ్డను వద్దనుకుంటున్నారంటే.. ఏదో పెద్ద కారణమే ఉండొచ్చు అంటుంది స్వప్న.
కాశీ కూడా అదే మాట చెబుతాడు. మీ విషయంలో మీ అభిప్రాయాలు కలవట్లేదు కానీ.. పక్కన వాళ్ల విషయంలో మాత్రం మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారు అంటాడు శ్రీధర్. మా గురించి మాట్లాడకు నాన్న అంటుంది స్వప్న. సరే కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లాడు. నేను ఈ రోజు కాంచన ఇంటి దగ్గరే పడుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు అని కాశీతో చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్.
హాస్పిటల్లో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. శౌర్యను చూడాలనిపిస్తోంది అని చెప్తుంది దీప. తను ఇచ్చిన బొమ్మ నీ కళ్లముందే ఉండేసరికి శౌర్య పదే పదే గుర్తు వస్తోంది. ముందు ఆ బొమ్మను తీసి పక్కన పెడతాను అంటాడ కార్తీక్. ఆగు ఆ బొమ్మ అక్కడే ఉండనివ్వు దాన్ని చూసైనా మీ మనసు మారుతుందేమో అంటూ వాళ్ల దగ్గరికి వస్తాడు శివన్నారాయణ.
నిజానికి మీ ముఖం ఇంకెప్పుడు చూడొద్దు అనుకున్న కానీ.. ప్రేమ చావలేక వచ్చాను. మీరు ఈ రోజు బిడ్డ విషయంలో తీసుకున్న నిర్ణయం, భవిష్యత్తులో మిమ్మల్ని బాధపెట్టవచ్చు. ఇప్పటికీ అవకాశం చేయిదాటిపోలేదు. ఒకసారి ఆలోచించండని చెప్తాడు శివన్నారాయణ. కార్తీక్ ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్తాడు. అంతలో జ్యోత్స్నకు దాసు ఫోన్ చేయడంతో కలవడానికి వెళ్తుంది.
55
దాసుకు షాక్
ఇప్పటికే చాలా తప్పులు చేసి తప్పించుకొని తిరుగుతున్నావు జ్యోత్స్న. ఇక పాపాలు చేయకమ్మా అంటాడు దాసు. ఇది చెప్పడానికే పిలిచావా దాసు అంటుంది జ్యోత్స్న. ఆ పిలుపు విని షాక్ అవుతాడు దాసు. నువ్వు నా నాన్నవి కాదు. మా నాన్నకు సొంత తమ్ముడివి కాదు. అలాంటప్పుడు నిన్ను ఎలా పిలిస్తే ఏంటి? నువ్వు ఎలా పోతే నాకేంటి అంటుంది జ్యోత్స్న.
దీప, కార్తీక్ ల జోలికి వెళ్లకు అంటాడు దాసు. దీప నా శత్రువు, తన పతనమే నా లక్ష్యం దాసు అంటుంది జ్యోత్స్న. దాసు అని పిలుస్తుంటే కోపం వస్తుందా.. ఫీల్ అవుతున్నావా? ఫీల్ అయితే నువ్వే మా నాన్న అంటుంది జ్యోత్స్న. సైలెంట్ గా ఉంటాడు దాసు. అయినా నేను దశరథ కూతురిని అయినప్పుడు దీప అనాథే కదా.. అంటుంది జ్యోత్స్న. కోపంగా చూస్తాడు దాసు. మరి చెప్పు దీప ఎవరు? ఎవరి కూతురు? ఎవరికి పుట్టింది? అని జ్యోత్స్న అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.