Ustaad Bhagat Singh Day 3 Collection : పవన్ కళ్యాణ్ సినిమా మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే?

Published : Mar 22, 2026, 12:27 PM IST

భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఉగాది సందర్భంగా మార్చ్ 19న రిలీజ్ అయిన ఈసనిమా మూడు రోజులకు గాను ఎంత వసూలు చేసిందంటే? 

PREV
16
బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మూడో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా మూడో రోజు ఈసినిమా రూ. 9.15 కోట్ల నెట్ కలెక్షన్ నమోదు చేసినట్లు సమాచారం. మొత్తం 3,340 షోలలో స్టార్ట్ అయిన ఈసినిమా తెలుగు వెర్షన్ ద్వారానే ఈ మొత్తం సాధించడం గమనార్హం. ఆదివారం రోజున సుమారు 36 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాక్నిల్‌క్ వెబ్‌సైట్ వెల్లడించింది.

26
మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మూడు రోజుల్లో ఇండియా మొత్తం రూ. 52.90 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది రూ. 62.42 కోట్లకు చేరుకుంది. విదేశీ మార్కెట్‌లో ఈ చిత్రం రూ. 9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 71.67 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో విడుదలైన మొదటి వారాంతంలోనే ఈ సినిమా 70 కోట్ల క్లబ్‌ను దాటింది.

36
ఆడియన్స్ ఏమంటున్నారంటే?

మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ అవ్వడం.. ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారింది. పండుగ వాతావరణం కారణంగా మొదటి మూడు రోజుల్లో థియేటర్లకు భారీగా ప్రేక్షకులు వచ్చారు. మొదటి రోజు ఓపెనింగ్స్ కు ఇది కీలకంగా మారింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించినప్పటికీ, ప్రేక్షకుల స్పందన మాత్రం మిశ్రమంగా ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది ప్రేక్షకులు సినిమా పాత తరహా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఉందని అభిప్రాయపడ్డారు.

46
ఉస్తాద్ భగత్ సింగ్ పై విమర్శలు..

కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదన్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కామెడీ, కమర్షియల్ అంశాల్లో కొంత వెనుకబడ్డారని, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఆయనకు ఉన్న ప్రత్యేక ఎనర్జీ ఈ చిత్రంలో పూర్తిగా కనిపించలేదని విమర్శలు వినిపించాయి.

56
వీకెండ్ ఉస్తాద్ కు కలిసొస్తుందా?

ఇక మరోవైపు, ఈ సినిమా మెచ్చిన కొంతమంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మాస్-రోమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసించారు. కథ పాతదే అయినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తీసుకెళ్లారని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే, ఈ చిత్రం వసూళ్ల పరంగా బలమైన ఓపెనింగ్ సాధించినప్పటికీ, దీర్ఘకాలిక విజయాన్ని నిర్ణయించేది ఇకపై వచ్చే ప్రేక్షకుల స్పందన మాత్రమే.

66
ఓజీని కూడా వదిలి పెట్టని ట్రోలర్స్..

ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల, ఆర్. పార్థిబన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రారంభ వసూళ్లలో పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ కీలక పాత్ర పోషించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ కూడా అభిమానులు, విమర్శకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఆ చిత్రంపై వచ్చిన సమీక్షల్లో దర్శకుడు సుజీత్ స్టార్ పవర్‌పై ఎక్కువగా ఆధారపడ్డారని, స్క్రీన్ ప్లేలో అంత డెప్త్ కనిపించలేదనే టాక్ వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories