జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?

Published : Mar 18, 2026, 11:03 PM IST

ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. మరోవైపు ధురంధర్ 2 ఉన్నప్పటికీ ఉస్తాద్ టికెట్స్ కోసం ఆడియన్స్ ఎగబడుతున్నారు. దీనికి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
ఉస్తాద్ భగత్ సింగ్

ట్రేడ్ వర్గాలు, సినీ పరిశ్రమ వర్గాలు ధురంధర్ 2 చుట్టూ ఏర్పడిన భారీ హైప్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్ ప్రీమియర్లపై ప్రభావం చూపుతుందని భావించాయి. విడుదలకు ముందు నుంచే ధురంధర్ 2పై పెరిగిన అంచనాలు విదేశీ మార్కెట్లో పోటీని మరింత పెంచుతాయని అంచనా వేశారు. రెండు సినిమాలు ఒకే సమయంలో విదేశాల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో థియేటర్ షెడ్యూళ్లు, ఓపెనింగ్స్ ప్రభావితమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషణలు సూచించాయి.

25
ఉస్తాద్ భగత్ సింగ్‌కు అనుకూలంగా

అయితే ఊహించని విధంగా అదే ధురంధర్ 2 పరిస్థితి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌కు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దర్శకుడు Aditya Dhar, నటుడు Ranveer Singh కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ అనుకున్న సమయానికి కంటెంట్ అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. దీంతో విదేశీ ప్రదర్శనల ప్లానింగ్‌లో మార్పులు చోటు చేసుకునే పరిస్థితి నెలకొంది.

35
కంటెంట్ ఆలస్యం

కంటెంట్ ఆలస్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్‌లో ప్రీమియర్ ప్రదర్శనలకు అంతరాయం కలగొచ్చు. ముఖ్యంగా డ్రైవ్ ఇన్ థియేటర్లలో ప్రీమియర్లు తాత్కాలికంగా రద్దయ్యే అవకాశం ఉందని పంపిణీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎలక్ట్రానిక్ కీలు ఆధారంగా పనిచేసే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు సినిమాను ప్రదర్శించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రదర్శన సాంకేతిక విధానాలపై ఆధారపడి షోలు కొనసాగుతాయా లేదా అన్నది తేలనుంది.

45
యూఎస్ ప్రీమియర్లు

ఇక ధురంధర్ 2 బృందం రేపు ఉదయం లోపు సినిమా కంటెంట్ పంపించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. నిర్ణయించిన గడువులోపు కంటెంట్ చేరకపోతే యూఎస్ ప్రీమియర్లు రద్దు చేయాల్సిన పరిస్థితి తప్పదని పంపిణీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విడుదల ప్రణాళికలో చివరి నిమిషంలో వచ్చిన ఈ అవరోధం విదేశీ మార్కెట్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

55
ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్

బుధవారం సాయంత్రం 5 గంటలకే ధురంధర్ 2 ప్రీమియర్ షోలు పడాల్సింది. కానీ రాత్రి 9 గంటలకు షోలు వాయిదా పడ్డాయి. 5 గంటల షోలు రద్దు కావడంతో ఇక ధురంధర్ 2 ప్రీమియర్ షోలు ఉండవని భావించారు. దీనితో ఉస్తాద్ టికెట్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా బెనిఫిట్ షోల కోసం ఆడియన్స్ ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో సాగుతున్నాయి. మొత్తంగా ధురంధర్ 2 కంటెంట్ డిలే కావడం ఉస్తాద్ కి కలసి వచ్చింది అని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories