గుర్తుపట్టలేకుండా మారిపోయిన ఉర్ఫీ జావెద్.. కారణం ఇదే? పిక్స్ వైరల్

First Published | Jul 25, 2023, 4:21 PM IST

బాలీవుడ్ సీరియల్ నటి ఉర్ఫీ జావెద్ తాజాగా షాకింగ్ లుక్ లో కనిపించింది. ఆ పార్ట్ కు సర్జరీ చేసుకోవడం.. అది వికటించడంతో గుర్తుపట్టలేనంతగా మారింది.
 

సాహసోపేతమైన దుస్తులను ధరిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ గా మారుతుంటుంది ఉర్ఫీ జావెద్ (Urfi Javed). అంతకు ముందే బాలీవుడ్ సీరియల్ నటిగా ఈ బోల్డ్ బ్యూటీ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 
 

‘బడే బయ్యా కీ దుల్హానియా’, చంద్ర నంది, మేరీ దుర్గా, బే పన్నాహ, జీజీ మా, హే రిస్తా క్యా ఖేల్తా హే వంటి టెలివిజన్ సీరిస్ లో నటించింది. ఆ క్రేజ్ తోనే హిందీ ‘బిగ్ బాస్’లోనూ అవకాశం దక్కించుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
 


ఇదిలా ఉంటే.. ఉర్ఫీ జావెద్ ఇటీవల భిన్నమైన దుస్తులు ధరిస్తూ స్కిన్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా తన అందంతో ఆకట్టుకుంది. 
 

ఇక తాజాగా ఉర్ఫీ జావెద్ ముఖం పూర్తిగా గుర్తుపట్టనంతగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె పంచుకుంది. తన పెదవులు ఉబ్బి, ఫేస్ వాచిపోయి, కళ్లు కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తున్నాయి. ఈరూపంలో ఉర్ఫీని గుర్తుపట్టడం కష్టమనే చెప్పాలి. 
 

అయితే తన పెదవులకు సర్జరీ చేయించుకోవడం వల్లే ఇలా జరిగినట్టు కూడా తెలిపింది. ఈ సందర్భంగా చిన్ననోట్ కూడా రాసుకొచ్చింది. 2016, 17కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంటూ ఇలా రాసింది. ‘నాకు 18 ఏళ్ల నుంచే లిప్ ఫిల్లర్లను ఆశ్రయిస్తున్నాను. నా పెదవులు చిన్నగా ఉండేవి, కానీ నిండుగా మారాలని కోరుకున్నాను. 
 

అందుకు సర్జరీ చేయించడంతో నా అందమంతా పోయింది. ఎవరైనా సరే సర్జరీలు చేయించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి‘ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. టేక్ కేర్ ఉర్ఫీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

Latest Videos

click me!