`ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి మైండ్‌ బ్లోయింగ్‌ రెమ్యూనరేషన్‌.. ఒక్క ఏడాదిలో ఇంతనా.. సెన్సేషన్‌ అంటే ఇది కదా!

Published : Sep 21, 2021, 05:56 PM ISTUpdated : Sep 21, 2021, 07:15 PM IST

`ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి ఏడాదిలోనే తన లైఫ్‌ టర్న్‌ అయిపోయింది. ఓవర్‌నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారింది. యంగ్‌ స్టర్స్ నుంచి స్టార్ హీరోల వరకు అందరి చూపు ఇప్పుడు కృతి శెట్టిపైనే ఉంది.

PREV
17
`ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి మైండ్‌ బ్లోయింగ్‌ రెమ్యూనరేషన్‌.. ఒక్క ఏడాదిలో ఇంతనా.. సెన్సేషన్‌ అంటే ఇది కదా!

కృతి శెట్టి నేడు (సెప్టెంబర్ 21) పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్ర సెట్‌లో కృతి బర్త్ డేని వేడుకలు నిర్వహించారు. కేట్‌ కట్‌ చేయించి విషెస్‌ తెలిపింది యూనిట్‌. ఇందులో హీరో సుధీర్‌బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి వారు పాల్గొన్నారు.

27

`ఉప్పెన` సినిమాకి ముందు కృతి శెట్టి అంటే ఎవరో కూడా తెలియదు. బాల నటిగా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది కృతి శెట్టి. కానీ `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యాక ఆమె రేంజే మారిపోయింది. తొలి పాటతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. 
 

37

ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కీర్తిసురేష్‌ ల తర్వాత ఆ స్థాయి గుర్తింపుని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయింది కృతి శెట్టి. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ఇటీవల `బంగార్రాజు`లో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో 

47

తొలి చిత్రానికి కృతికి ఇచ్చిన పారితోషికం కేవలం ఆరు లక్షలు. ఆ సినిమా హిట్‌ అయ్యాక దాదాపు 60-70 లక్షల వరకు గిఫ్ట్ ల రూపంలో అందించారు నిర్మాతలు. `ఉప్పెన` చిత్రంతో నటిగా క్రేజ్‌ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్‌ కూడా పెరిగిపోయింది. 
 

57

ప్రస్తుతం కృతి నటిస్తున్న చిత్రాలకు గానూ దాదాపు డెబై నుంచి ఎనబై లక్షల వరకు పారితోషికం అందుకుంటుందట. అంతేకాదు `ఉప్పెన` సినిమాని హిందీలో రీమేక్‌ చేసేందుకు ప్లాన్‌ జరుగుతుంది. అందులోనూ కృతినే హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించారట. ఈ సినిమాకి కూడా భారీ రెమ్యూనరేషన్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 
 

67

హిందీ సినిమాకిగానూ కృతి కి ఏకంగా కోటి రూపాయలు ఆఫర్‌ చేశారట. దీంతో కృతి ఒక్క ఏడాదిలో ఏ రేంజ్‌కి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాది క్రితం కృతి తొలి సినిమా రెమ్యూనరేషన్‌ ఆరు లక్షలు. ఇప్పుడు బాలీవుడ్‌ చిత్రానికి కోటీ రూపాయలు. ఊహించని విధంగా ఈ అందాల భామ రేంజ్‌ మారిపోయిందని చెప్పొచ్చు. మరి దీన్ని ఏమేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. 

77

అయితే గ్లామర్‌కి దూరంగా ట్రెడిషనల్‌గా కనిపిస్తూ క్యూట్‌ లుక్స్ తో మెస్మరైజ్‌ చేయడం కృతి స్పెషాలిటి. మరి ఈ స్పెషాలిటీని మేకర్స్ ఎంత వరకు ఎంకరేజ్‌ చేస్తారనేది చూడాలి. మరోవైపు ప్రతిభ ఉంటే అందాల ఆరబోత ముఖ్యం కాదనే విషయాన్ని కూడా కృతి నిరూపిస్తుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories