తారక్ కు కూడా కన్నడ భాష స్పష్టంగా రావడంతో పాటు అక్కడా ఆయనకు వీరాభిమానులు ఉండటం మూలంగా డైరెక్ట్ గా కన్నడలోనే నిర్మించాలని భావిస్తున్నారంట. మరోవైపు ఎన్టీఆర్ తల్లి కూడా కన్నడ ప్రాంతానికి చెందినది కావడంతో ‘ఎన్టీఆర్ 31’ను కన్నడ, తెలుగులో బైలింగ్వల్ గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఎన్టీఆర్31’ నుంచి వచ్చిన పోస్టర్ తోనే అంచనాలు ఏర్పడ్డాయి.