Upasana Valentines Tips: రామ్‌చరణ్‌తో అలా చేయడం వల్లే హ్యాపీగా ఉందట.. లవ్‌ టిప్స్ చూసేయండి..

Published : Feb 15, 2022, 10:42 AM ISTUpdated : Feb 15, 2022, 04:28 PM IST

మ్యారేజ్‌ లైఫ్‌లో ఆరోగ్యమే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది ఉపాసన. ప్రేమలో పడటం ఈజీనే కానీ ప్రేమని ఎక్కువ కాలం కొనసాగించడం లవర్స్ గా పార్క్ ల్లో నడిచినంత ఈజీ కాదట. 

PREV
17
Upasana Valentines Tips: రామ్‌చరణ్‌తో అలా చేయడం వల్లే హ్యాపీగా ఉందట.. లవ్‌ టిప్స్ చూసేయండి..

రామ్‌చరణ్‌, ఉపాసన పదేళ్లుగా తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇద్దరి రంగాలు వేరు. పైగా ఇద్దరు తమ రంగాల్లో అగ్ర స్థానాల్లో ఉన్నారు. వైవాహిక జీవితాన్ని, ప్రొఫేషన్‌ని బ్యాలెన్స్ చేస్తూ తమ లైఫ్‌ని హ్యాపీగా గడుపుతున్నారు. అయితే తాము పదేళ్లుగా సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు సీక్రెట్స్ ఏంటో రివీల్‌ చేసింది ఉపాసన. అలా చేయడం వల్లే రామ్‌చరణ్‌తో ఇన్నాళ్లు హ్యాపీగా ఉన్నామని ఆసక్తిని రేకెత్తిస్తుంది. 
 

27

సోమవారం ప్రేమికుల రోజు. ఈ సందర్బంగా ఉపాసన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాము సంతోషంగా ఉండేందుకు దోహదపడ్డ అంశాలేంటో వెల్లడించింది ఉపాసన. ఎప్పుడూ ప్రేమగా ఉండటం పార్క్ ల్లో తిరిగినంత ఈజీ కాదని చెబుతుంది. ఆమె ఈ విషయాన్ని పంచుకుంటూ పలు హెల్త్ టిప్స్ చెప్పింది ఉపాసన. ఈ మేరకు ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

37

మ్యారేజ్‌ లైఫ్‌లో ఆరోగ్యమే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పింది ఉపాసన. ప్రేమలో పడటం ఈజీనే కానీ ప్రేమని ఎక్కువ కాలం కొనసాగించడం లవర్స్ గా పార్క్ ల్లో నడిచినంత ఈజీ కాదు.  దాన్ని ఎప్పుడూ అంతే ప్రేమగా ఉంచుకోవాలి అని చెప్పింది ఉపాసన. తమ పదేళ్ల విజయవంతమైన వైవాహిక జీవితానికి కారణాలు ఇవే అయి ఉండొచ్చని పలు సలహాలు సూచనలు చేసింది ఉపాసన. 

47

భార్యభర్తలు ఇద్దరు ఆరోగ్యంగాఉండాలని చెప్పింది. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొంది. ఉదయాన్నే నిద్ర లేవడం వల్లే మనం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తాను నమ్ముతానని చెప్పింది ఉపాసన. చాలా మంది మ్యారేజ్‌ గోల్స్ ని పెయిన్‌ ఫుల్‌గా భావిస్తారని, కానీ ప్రేమతో చేస్తే అవే అందంగా ఉంటాయని తెలిపింది. 

57

ప్రతి రోజు మనకిష్టమైన వారితో కాస్త సమయాన్ని గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలని, కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, కలిసి సినిమాలు చూడటం, ఇలాంటివి జీవితాన్ని మరింత ప్రేమతో నింపి, మరింత అందంగా, సంతోషంగా మారుస్తాయని వెల్లడించింది ఉపాసన. 
 

67

అంతేకాదు ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పింది ఉపాసన. ఎప్పుడైనా ఓ వారం డేట్‌ నైట్‌ని ప్లాన్‌ చేసుకోండి. మీ వివాహ బంధంలో ఏవైనా దూరాలు ఉంటే మళ్లీ కనెక్ట్ అవ్వండి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. కానీ అది నిజం కాదని నా నమ్మకం. భూమ్మీద ఓ ఇద్దరు చేసే ఎఫర్ట్స్ పైనే వారి దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుందని, దీంతోపాటు జీవిత భాగస్వామిపట్ల అమితమైన ప్రేమ, గౌరవాన్ని కూడా కలిగి ఉండాలని చెప్పింది ఉపసాన. 
 

77

అపోలో ఆసుపత్రుల అధినేత ప్రతాప్‌ సి రెడ్డి మనవరాలు ఉపాసన అనే విషయం తెలిసిందే. ఆమె అపోలో ఫార్మసీకి హెడ్‌గా ఉన్నారు. 2012 జూన్‌ 14న మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్‌ని వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరు పెళ్లికి ముందు సీక్రెట్‌ డేటింగ్‌ చేసినట్టు టాక్‌. చిన్నప్పటి స్కూల్‌ ఫ్రెండ్స్ కూడా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories