లిప్‌లాక్‌ చేస్తుంటే తాప్సి కి చేదు అనుభవం.. డైరెక్టర్‌ వల్గర్‌ కామెంట్‌.. చిరాకులో ఏం చేసిందంటే?

Published : Feb 15, 2022, 09:47 AM IST

సొట్ట బుగ్గల సుందరి తాప్సి 2010లో తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.

PREV
15
లిప్‌లాక్‌ చేస్తుంటే తాప్సి కి చేదు అనుభవం.. డైరెక్టర్‌ వల్గర్‌ కామెంట్‌.. చిరాకులో ఏం చేసిందంటే?

తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాల్లో కూడా తాప్సి నటిస్తోంది. తాప్సి నటించిన చిత్రాలు ఎక్కువగా ఓటిటి వేదికల్లో రాణిస్తున్నాయి. తాప్సి రీసెంట్ గా నటించిన చిత్రం 'లూప్ లపేట'. ఇది 1998లో తెరకెక్కిన జర్మన్ మూవీ 'రన్ లోలా రన్' అనే చిత్రానికి రీమేక్. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తాప్సి ఓ చేదు అనుభవం ఎదుర్కొంది.

25

ఈ విషయాన్ని తాప్సి తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఈ మూవీలో తాప్సి, నటుడు తాహిర్ మధ్య రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో దర్శకుడు ఆకాష్ భాటియా తన అసభ్యకరమైన కామెంట్స్ తో చిరాకు పుట్టించారని తాప్సి పేర్కొంది.

35

తమని ముద్దు సన్నివేశం పూర్తి చేయనీయకుండా ఆకాష్ కామెంట్రీ తరహాలో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను, తాహిర్ ముద్దు సన్నివేశం మొదలు పెట్టాం. దీనితో ఆకాష్.. ఓకే.. మొదలు పెట్టండి, నైస్ గా మాట్లాడుకోండి.. మీ చేతులని ఒకరినొకరు హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ముద్దు పెట్టుకోండి. ఆ ముద్దు ఎలా ఉండాలంటే ఒకరికొకరు స్విచ్ ఆన్ చేసినట్లుగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ కామెంట్స్ పట్టించుకోకుండా మేమిద్దరం కిస్ సీన్ లో నటిస్తున్నాం. 
 

45

కానీ మధ్యలో ఆకాష్ కామెంట్స్ శృతి మించాయి. ముద్దు సీన్ మధ్యలో ఉండగా.. తాహిర్ ఇలాంటి అమ్మాయిని ఇంతకు ముందెప్పుడూ నువ్వు చూడలేదు. ఇలాంటి అమ్మాయితో ఇలాంటి ఛాన్స్ ఎప్పుడూ నీకు దక్కలేదు.. కిస్ చెయ్' అంటూ అసభ్యంగా మాట్లాడాడు. నాకు చిరాకు వేసింది. వెంటనే కిస్సింగ్ సీన్ ని మధ్యలోనే ఆపేశాను. నేను తాహిర్ వంక చూస్తూ .. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు ? అని ప్రశ్నించాను. ఆయన కామెంట్స్ చాలా డిస్ట్రబ్ గా ఉన్నాయి అని చెప్పినట్లు తాప్సి పేర్కొంది. 
 

55

ఆ తర్వాత మళ్ళీ ఆ కిస్ సీన్ ని పూర్తి చేసినట్లు తాప్సి పేర్కొంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన లూప్ లపేట చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒరిజినల్ మూవీ రన్ లోలా రన్ లో నటించిన నటి ఫ్రాంకా కూడా సోషల్ మీడియా వేదికగా తాప్సికి శుభాకాంక్షలు తెలిపారు. తమ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories