వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి పార్టీలో ఉపాసన.. ఈ ఫొటోలు చూశారా?

First Published | Nov 4, 2023, 12:38 PM IST

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన పార్టీలో ఉపాసన కొణిదెల స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిశారు. ఇందుకు సంబంధించిన మెమోరబుల్ ఫొటోలను షేర్ చేసింది. 
 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  మ్యారేజ్ అంగరంగ వైభవంగా ఇటలీ వేదికన జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 1న జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. 
 

ఇక వరుణ్ - లావణ్యపెళ్లిలో మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidea) అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ దుస్తులు, పార్టీ వేర్స్ లో అదరగొట్టారు. ఇప్పటికే లావణ్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 


ఈక్రమంలో ఉపాసన మరిన్ని బెస్ట్ ఫొటోలను, మెమోరబుల్ పిక్స్ ను మెగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో లావణ్యతో కలిసి సందడి చేసిన ఫొటోలను కూడా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 

లావణ్య, అల్లు స్నేహాలతో కలిసి ఉపాసన కొణిదెల ఇచ్చిన స్టిల్ నెట్టింట వైరల్ గా మారింది. మెగా, అల్లు వారి కోడళ్లు ఓకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు వారి పార్టీ వైబ్స్ కూ ఫిదా అవుతున్నారు. 
 

వరుణ్ పెళ్లి కోసం ఉపాసన కూడా తనవంతుగా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. పెళ్లిలోనూ మెగా కోడలి సందడి బాగానే కనిపించింది. కుటుంబికులు, బంధువులతో కలిసి వివాహ వేడుకలో ఉపాసన మరింత జోష్ పెంచేలా చేశారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. 
 

ఇక మెగా ఫ్యామిలీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు నూతన వధూవరులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లోనే అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేపు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.
 

Latest Videos

click me!