పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా... సమంత ఒంటిపై చెరగని నాగ చైతన్య జ్ఞాపకం!

Published : Nov 04, 2023, 12:21 PM IST

సమంత తన ఒంటిపై ఉన్న ఓ టాటూ చెరిపివేశారంటూ ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తాజాగా బయటపడింది. దీంతో సమంత ఒంటిపై నాగ చైతన్య గుర్తు అలానే ఉండిపోయింది.   

PREV
16
పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా... సమంత ఒంటిపై చెరగని నాగ చైతన్య జ్ఞాపకం!
Samantha

సమంత-నాగ చైతన్య 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాలో వీరి పెళ్లి జరిగింది. సమంతను కోడలు చేసుకునేందుకు అక్కినేని ఫ్యామిలీ తిరస్కరించారనే వాదన వినిపించింది. ఏది ఏమైనా పట్టుబట్టి సమంతకు తాళి కట్టాడు చైతు. 


 

26

నాలుగేళ్లు హ్యాపీగా కాపురం చేశారు. వ్యక్తిగత కారణాలతో మనస్పర్థలు తలెత్తాయి. ఇద్దరూ విడిపోయారు. సమంత-చైతు విడివిడిగా ఉంటున్న విషయం బయటకొచ్చింది. విడాకుల వార్తలు హల్చల్ చేశాయి. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. 

 

36
Samantha Ruth Prabhu

సమంత సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య మీద అసహనం బయటపెట్టింది. పరోక్షంగా మాజీ భర్తను ఉద్దేశిస్తూ కామెంట్స్ పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలలో నేరుగా ఆరోపణలు చేసింది. నాగ చైతన్య మీద సమంత కోపంగా ఉన్నారన్న విషయం బహిర్గతం అయింది. 

46
samantha tattoo

ఇటీవల సమంత చేసిన ఓ ఫోటో షూట్ చర్చకు దారి తీసింది. ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బోల్డ్ ఫోజుల్లో కాకరేపారు. ఆ ఫోటోల్లో సమంత రిబ్ క్రింద ఉండాల్సిన టాటూ కనిపించలేదు. దాంతో సమంత ఆ టాటూ తీయించేశారని కథనాలు వెలువడ్డాయి. సమంత ఒంటిపై మూడు టాటూలు ఉన్నాయి. వీపు మీద 'YMC' అనే టాటూ ఉంది. 
 

56
Samantha

YMC అంటే సమంత డెబ్యూ మూవీ ఏమాయ చేసావే టైటిల్ షార్ట్ ఫార్మ్. రెండో టాటూ రిస్ట్ మీద ఉంది. మూడో టాటూ కుడి రిబ్ మీద చేయ్ అని ఉంటుంది. చేయ్ అంటే నాగ చైతన్య నిక్ నేమ్. ఈ టాటూ సమంత చెరిపి వేయించారని వాదన జరుగుతుంది. కాదని తాజా ఫోటోలకు తేలిపోయింది. 

66
Samantha


సమంత లేటెస్ట్ ఫోటో షూట్ లో ఆమె ఎద క్రింది భాగంలో టాటూ అలానే ఉంది. కాబట్టి నాగ చైతన్య జ్ఞాపకం సమంత ఒంటిపై ఇంకా అలానే ఉందన్న మాట. ఇటీవల సమంత పెట్ డాగ్ యష్ నాగ చైతన్య వద్ద కనిపించింది. ఇది కూడా కొత్త అనుమానాలకు దారి తీసింది. 

Read more Photos on
click me!

Recommended Stories