Published : Feb 09, 2026, 10:07 PM ISTUpdated : Feb 09, 2026, 10:09 PM IST
Upasana Konidela: జనవరి 31న రాంచరణ్, ఉపాసన దంపతులు ఆడ, మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. తనకు కవల పిల్లలు జన్మించిన తర్వాత ఉపాసన తాజాగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగా కోడలు ఉపాసన కొణిదెల ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చింది. జనవరి 31న రాంచరణ్, ఉపాసన దంపతులు ఆడ, మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. రాంచరణ్ ఉపాసన దంపతులకు తొలి సంతానంగా క్లీంకార 2023లో జన్మించింది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలిలో మరో ఇద్దరు మెంబర్స్ జాయిన్ అయ్యారు.
25
ఉపాసన ఫస్ట్ రియాక్షన్
కవల పిల్లలు పుట్టాక ఉపాసన కొణిదెల తొలిసారి తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన డెలివరీ ప్రాసెస్.. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి కవలలు జన్మించి ఫ్యామిలీ, అభిమానులు సంబరాలు చేసుకునే వరకు జరిగిన పరిణామాలని ఆమె వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
35
ఎమోషనల్ వీడియో వైరల్
ఈ వీడియోలో రాంచరణ్ తన సతీమణి ఉపాసనని అపోలో ఆసుపత్రికి తీసుకెళుతున్న దృశ్యాలు, ఉపాసన డెలివరీకి డాక్టర్స్ టీం చేస్తున్న ఏర్పాట్లు చూపించారు. అదే విధంగా ఉపాసన పర్సనల్ ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్యుడు మహేష్ బాంగ్ చెబుతున్న మాటలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.
అదే విధంగా అపోలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె సుబ్బారెడ్డి చెబుతున్న వివరాలు కూడా ఉన్నాయి. ఉపాసన సేఫ్ డెలివరీ కోసం అపోలో ఆసుపత్రిలో 2 డాక్టర్ల బృందాలు పనిచేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ లతా మాట్లాడుతూ తప్పకుండా ఒత్తిడి ఫీల్ అయ్యా. ఎందుకంటే ఉపాసన సేఫ్ డెలివరీ కావడం, వారికి ఆరోగ్యకరమైన పిల్లలను అందించడం నా రెస్పాన్సిబిలిటీ అని తెలిపారు.
55
చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా
ఉపాసన కవలలకు జన్మనిచ్చిన తర్వాత చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించి ఆ శుభవార్తని పంచుకున్న మాటలు చూపించారు. అదే విధంగా చిరంజీవి ఆల్ ఇండియా ఫాన్స్ ప్రెసిడెంట్ రవణం స్వామి నాయుడు తన సంతోషాన్ని తెలియజేస్తున్న మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. ఉపాసన..స్పందిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి సారీ.. నా గుండె నిండిపోతోంది. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. అపోలో ఆసుపత్రి టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు. రాంచరణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు.