పెళ్ళికి ముందు అవమానం, నా బాడీ గురించి..పెళ్లి తర్వాత చరణ్, మా అత్తామామ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నా

First Published | Oct 18, 2024, 2:08 PM IST

మెగా కోడలు కొణిదెల ఉపాసన తన మంచి మనసుతో అందరి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. గతేడాది రాంచరణ్, ఉపాసన దంపతులు దాదాపు పదేళ్ల నిరీక్షణకు ముగింపు చెబుతూ తల్లిదండ్రులు అయ్యారు. పండంటి పాపకి ఉపాసన జన్మనిచ్చింది.

మెగా కోడలు కొణిదెల ఉపాసన తన మంచి మనసుతో అందరి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. గతేడాది రాంచరణ్, ఉపాసన దంపతులు దాదాపు పదేళ్ల నిరీక్షణకు ముగింపు చెబుతూ తల్లిదండ్రులు అయ్యారు. పండంటి పాపకి ఉపాసన జన్మనిచ్చింది. పాపకి క్లింకార అనే పేరు పెట్టారు. అయితే ఉపాసన.. రాంచరణ్ పెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత అనేక అవమానాలకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఆమె గురించి చాలా మంది కామెంట్స్ చేశారు. 

అలాంటి కామెంట్స్ ఉపాసనకు పెళ్ళికి ముందు కూడా ఎదురయ్యాట. ఈ విషయాన్ని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. పెళ్ళికి ముందు నాకు ఊబకాయం ఉండేది. చబ్బీగా కనిపించేదాన్ని. చాలా మంది నా బాడీపై కామెంట్స్ చేసేవారు. వాళ్ళ కామెంట్స్ కొంతవరకు బాధించేవి కానీ.. నేను ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సన్ ని. ఎదుటివాళ్ళ కామెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అని ఉపాసన పేర్కొంది. 

Also Read: ఒకసారి నాగార్జున చేతిలో, మరోసారి బోయపాటి చేతిలో..దారుణంగా మోసపోయి బాధపడ్డ క్రేజీ హీరో


నాపై నాకు నమ్మకం ఉంది. కొన్నిసార్లు ఎదుటివాళ్ళ కామెంట్స్ ని కేర్ చేసేదాన్ని కాదు. నా చుట్టూ వందల మంది ఉంటారు వాళ్ళందరి కామెంట్స్ ని హార్ట్ కి తీసుకుంటే కష్టం. నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తే అప్పుడు నిజంగా బాధపడాలి. కానీ నన్ను ప్రేమించేవారు ఎవరూ ఎప్పుడూ నాపై కామెంట్స్ చేయలేదు. పెళ్లి తర్వాత కూడా ఇలాంటి కామెంట్స్ ఎదురయ్యాయి. 

Also Read : అకిరాకి ఏమీ మిగల్చడం లేదు..ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడేస్తున్నారు, కొత్త ఆందోళన

పెళ్లి తర్వాత నాపై మీడియా, సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువైంది. కామెంట్స్ కూడా పెరిగాయి. కానీ రాంచరణ్, మా అత్తామామ నాకు అద్భుతంగా సపోర్ట్ ఇచ్చారు. రాంచరణ్ నా విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. నా డ్రైవర్, అసిస్టెంట్ విషయంలో రాంచరణ్ ప్రత్యేక శ్రద్ద చూపించాడు. నాకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీమ్ ని రాంచరణ్ సెట్ చేశాడు. చరణ్, మా అత్తామామ ప్రేమ కొన్నిసార్లు నాకు కన్నీళ్లు తెప్పించింది అని ఉపాసన పేర్కొంది. 

ఉపాసన ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వ్యవహారాలు చూసుకుంటూనే అనేక చారిటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపాసన చేస్తున్న చారిటి కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఉపాసన, రాంచరణ్ 2012లో వివాహం చేసుకున్నారు. 

Latest Videos

click me!