ట్రేడ్ టాక్ : #Pushpa-2 బిజినెస్ పై ఎన్టీఆర్ ‘దేవర’ఇంపాక్ట్

First Published | Oct 18, 2024, 12:43 PM IST

తొలి భాగం వచ్చిన (2021 డిసెంబరు 17) మూడేళ్లకు రెండో భాగం రానుండటం గమనార్హం.  పుష్పలో  ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ..

Devara, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 
సినిమా బిజినెస్ చాలా గమ్మత్తుగా జరుగుతూంటుంది. ఆ హీరో గత చిత్రం ఎలా ఆడింది, అలాగే డైరక్టర్ ఫామ్ లో ఉన్నాడా, బ్యానర్ ఏమిటి ,ట్రైలర్ క్లిక్ అయ్యిందా వంటి విషయాలతో పాటు ప్రస్తుతం ప్రేక్షకుల మూడ్ ఎలా ఉందనేది కూడా కీలకంగా మారుతుంది. ఇప్పుడు పుష్ప 2 బిజినెస్ విషయంలో అదే చూస్తున్నారు అని తెలుస్తోంది.

సౌత్ సినిమాలకు నార్త్ లో ఆదరణ ఓ రేంజిలో ఉండటంతో అక్కడ ఇప్పుడు పుష్ప2 పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. దేవరతో మరోసారి అక్కడ సౌత్ సినిమా జెండా ఎగరేయటం పుష్ప 2 కు కలికి వచ్చే అంశంగా కనిపిస్తోంది.   దేవర తెలుగు రాష్ట్రాల్లో , అమెరికాలో దుమ్ము దులిపింది. దాంతో మన తెలుగు వెర్షన్ కు  కూడా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Devara, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


ఎన్టీఆర్ నటించిన దేవర ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లోనే కాకుండా నార్త్ లోనూ  పెద్ద హిట్‌గా నిలిచింది. మొదటి రోజు మౌత్ టాక్ చెప్పుకోదగిన రీతిలో లేకపోయినా సినిమా రెండు రోజుల్లో ఊపు అందుకుని భాక్సాఫీస్ దగ్గర కదం తొక్కేసింది.   డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్డిబిటర్స్ అందరూ ఓవర్ ఫ్లోలతో  లాభాలను ఆర్జించారు.  దీంతో ట్రేడ్ లో ఉన్న మిగతా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లు తాము కూడా ఓ పెద్ద సినిమాలతో లాభాలు సంపాదించాలనే కోరిక రెట్టింపు అయ్యింది.

దాంతో వారు ఎంత పెట్టడానికి అయినా ముందుకు వస్తున్నారు. దానికి తోడు  కల్కి 2898 AD కూడా మొదట్లో డివైడ్ టాక్  ఉన్నప్పటికీ  దుమ్ము రేపింది. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు పుష్ప 2: ది రూల్‌పై పెద్ద ఎత్తున పందెం కాయటానికి రెడీ అవుతున్నారు. పుష్ప 2 నిర్మాతలు పెద్ద మొత్తంలో కోట్ చేసినప్పటికీ పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.


Devara, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


కొన్ని ప్రాంతాలలో, పుష్ప 2 హక్కుల కోసం ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ రేసులో ఉన్నారు. వచ్చే నెలలో డీల్స్‌ను ఖరారు చేయనున్నారు మేకర్స్. డిమాండ్‌ కారణంగా డిస్ట్రిబ్యూటర్‌లలో మార్పులు చోటుచేసుకుంటాయవు తెలుస్తోంది. ఈ స్దాయి డిమాండ్ కు మరో కారణం కూడా ఉంది.  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్  క్రిస్మస్ నుండి సంక్రాంతికి మార్చబడటం మరో పెద్ద కారణం. పుష్ప 2: క్రిస్మస్ ,న్యూ ఇయిర్ వీకెండ్స్ లో మంచి పనితీరును కనబరచడానికి  అవకాశం ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్  సినిమాపై బాగా నమ్మకంగా ఉన్నారు.

Devara, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబోలో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. గతంలో ఈ కలయికలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ సినిమా పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  

Devara, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


మరో ప్రక్క  ఈ చిత్రం గురించి పుష్ప-2 సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ కన్‌సర్ట్‌ గురించి ఏర్పాటు చేసిన ఓ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''పుష్ప-2 ఇటీవల ఫస్ట్‌ హాఫ్‌ చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌గా వుంది. పుష్ప కథను ఇప్పుడే కాదు స్క్రిప్ట్‌ విన్నప్పుడే నేను లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ మూడు సార్లు క్లాప్స్‌ కొట్టాం..

సుకుమార్‌ కథ చెబుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెలా.. ఇక్కడ ఇంటర్వెలా అని మేము అంటున్నాం.. అంతలా మాకు ప్రతి సీన్‌ కిక్‌ ఇచ్చింది. ప్రతి సీన్‌లోనూ ఎంతో ఎనర్జీ వుంటుంది. సినిమా చూసినప్పుడు సుకుమార్‌ కథను రాసిన విధానం  సినిమాను తెరకెక్కించిన తీరు, అల్లు అర్జున్‌ నటించిన విధానం నెక్ట్స్‌ లెవల్‌లో వుంటుంది. సినిమా నెక్ట్స్‌ లెవల్‌ సినిమా అంతే.. ఇక ఫస్ట్ హాఫ్‌ అయితే సూపర్‌గా వుంది అంతే..అని అన్నారు. 

Latest Videos

click me!