నందమూరి హరికృష్ణతో, నాని, కార్తీ లాంటి హీరోలతో నాగార్జున మల్టీస్టారర్ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు సుమంత్ తో కూడా నాగార్జున నటించారు. ఇక డైరెక్టర్ బోయపాటి గురించి పరిచయం అక్కర్లేదు. మాస్ చిత్రాలకు మరింత క్రేజ్ పెంచిన డైరెక్టర్ బోయపాటి. భద్ర, తులసి, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బోయపాటి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు.