మంచు విష్ణుపై రెచ్చిపోయిన హైపర్ ఆది.. కామెడీ పంచ్ లతో దారుణంగా ట్రోలింగ్, వ్యవహారం ముదిరితే..

First Published | Oct 31, 2021, 2:04 PM IST

అక్టోబర్ 10న యుద్దాన్ని తలపించే స్థాయిలో 'మా' ఎన్నికలు ముగిశాయి. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి 'మా'కి విష్ణు కొత్త అధ్యక్షుడిగా అవతరించాడు. ప్రమాణస్వీకారం చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా స్వీకరించారు.

అక్టోబర్ 10న యుద్దాన్ని తలపించే స్థాయిలో 'మా' ఎన్నికలు ముగిశాయి. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి 'మా'కి విష్ణు కొత్త అధ్యక్షుడిగా అవతరించాడు. ప్రమాణస్వీకారం చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే మా ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. పరస్పర విమర్శలతో టాలీవుడ్ హీటెక్కింది. 

MAA  ఎన్నికల ప్రచారంలో Manchu Vishnuపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగానే జరిగింది. కానీ సరైన వ్యూహాలు అమలు చేసిన విష్ణు విజయం సాధించాడు. ఇదిలా ఉండగా మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ Jabardasth కమెడియన్ హైపర్ ఆది తీవ్రమైన ట్రోలింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీపావళి సందర్భంగా ఓ ఛానల్ లో 'తగ్గేదే లే' అంటూ ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది.. మంచు విష్ణుని ట్రోల్ చేస్తూ కామెడీ డైలాగులు పేల్చాడు. 


ఈ ఈవెంట్ లో రోజా, ప్రియమణి, ఇంద్రజ ఇతర జబర్దస్త్ నటులు పాల్గొన్నారు. ఆట పాటలతో ఈ ఈవెంట్ కలర్ ఫుల్ గా సాగింది. రోజా, ప్రియమణి, ఇంద్రజ గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే మన్నార చోప్రా కూడా ఈ ఈవెంట్ లో మెరిసింది. రొమాంటిక్ డాన్స్ పెర్ఫామెన్స్ లు కూడా ఈ ఈవెంట్ లో హైలైట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడులైంది. 

ఈ ప్రోమో చివర్లో Hyper Aadi.. మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్న కామెడీ పంచ్ లు పెట్టారు. 'మా' ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచు విష్ణు మాట్లాడిన.. లెట్ దెమ్ నో  అంకుల్, టంగుటూరి.. ' లాంటి డైలాగులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వీటిని ఉపయోగిస్తూ మంచు విష్ణుపై హైపర్ ఆది రెచ్చిపోయాడు.   

ప్రకాష్ రాజ్ గారికి తెలుగు భాషపై పట్టు శూన్యం.. కావాలంటే ఆయన్ని టంగుటూరి... గురించి మాట్లాడాలని విష్ణు టాంగ్ స్లిప్ అయ్యాడు. దీనితో విష్ణుపై ట్రోలింగ్ నడిచింది. దీనిని ఉపయోగిస్తూ.. ప్రియమణి, ఇంద్రజ, రోజాలని టార్గెట్ చేస్తూ.. మీకు స్క్రిప్ట్ మీద పట్టు శూన్యం.. ఏది గురజాడ. గురించి మాట్లాడండి చూద్దాం అంటూ తనదైన శైలిలో పంచ్ లు పేల్చాడు ఆది. 

అలాగే 'లెట్ దెమ్ నో అంకుల్' అని కూడా హైపర్ ఆది హాస్యం పండించాడు. ఇది కామెడీ వరకు అయితే ఒకే కానీ.. వివాదం ముదిరి మంచు విష్ణు సీరియస్ గా తీసుకుంటే మరో కాంట్రవర్సీ చెలరేగుతుంది. 

Latest Videos

click me!