Latest Videos

స్టార్‌ క్రికెటర్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న జయసుధ.. వాళ్లు గే అని తెలియడంతో షాక్ లో సహజనటి

First Published May 26, 2024, 7:52 PM IST

సహజనటి జయసుధకి టీనేజ్‌లో ఓ స్టార్‌ క్రికెటర్‌పై క్రష్‌ ఏర్పడిందట. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కూడా భావించిందట. మరోవైపు వాళ్లు గే అని తెలిసి షాక్‌ అయ్యిందట. మరి ఆ కథేంటంటే?
 

సహజనటి జయసుధ తొలితరం హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఇప్పటికీ సహజ నటిగానే రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. స్టార్‌ హీరోలకు తల్లి పాత్రలు, అత్త పాత్రల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. అందుకే అడపాదడపా వెండితెరపై మెరుస్తుంది జయసుధ. 
 

ఇటీవల ఆమె వరుసగా ఇంటర్వ్యూలిస్తుంది. పలు యూట్యూబ్‌ ఛానెళ్లతో మాట్లాడుతూ అలనాటి విషయాలను పంచుకుంటుంది జయసుధ. అరుదైన విషయాలను షేర్‌ చేసుకుంటుంది. చాలా ఆసక్తికర విషయాలను నేటితరానికి తెలియజేస్తుంది. దీంతో ఆమె చెప్పే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జయసుధ రెండు సార్లు పెళ్లి చేసుకుంది. తన రెండో భర్త నితీన్‌ కపూర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 
 

ఇటీవల మరో వ్యక్తితో క్లోజ్‌గా తిరిగింది జయసుధ. ఆయన్ని మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే అతను తన జీవితంపై పుస్తకం రాస్తున్నారని, తన లైఫ్‌ని దగ్గరుండి చూడాలనే ఉద్దేశ్యంతో తన వెంట వస్తున్నాడని తెలిపింది జయసుధ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి ముందు విషయాలను బయటపెట్టింది జయసుధ. హీరోయిన్‌గా ప్రారంభంలో ఏ హీరోతోనైనా క్రష్ ఉందా అనే ప్రశ్నకి ఆమె స్పందించింది. 
 

ప్రారంభంలో తాను కూడా క్రష్ కి గురైనట్టు తెలిపింది. వెరీ బిగినింగ్ లో తెలుగు హీరోలకు సంబంధించి చిన్న క్రష్‌ అనిపించినా, అది ఎక్కువ కాలం లేదని చెప్పింది. అయితే తనకు క్రికెటర్లపై బాగా ఇంట్రెస్ట్ ఉండేదట. వాళ్లంటే చాలా క్రష్‌గా ఫీలయ్యేదట జయసుధ. అలా పాకిస్తానీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అంటే చాలా ఇష్టం ఏర్పడిందట. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగిందట. చాలా రోజులు కలలు కనిందట జయసుధ. కానీ ఆ క్రష్‌ పెళ్లి వరకు వెళ్లలేకపోయిందని చెప్పింది. 
 

దీంతోపాటు హిందీలో హీరోలపై కూడా క్రష్‌ ఉండేదని, ఆ హీరో బాగుంటాడనుకునేదట. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టింది జయసుధ. తనకు సింగర్స్ పై బాగా ఆసక్తి ఉండేదని, ఇమ్రాన్‌ ఖాన్‌ మాదిరిగానే వారిని కూడా పెళ్లి చేసుకుంటే బాగుండేదనే కలలు కన్నదట జయసుధ. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ సింగర్స్ గే అని తెలిసి పెద్ద షాక్‌కి గురయ్యిందట. వామ్మో మనం టెంప్ట్ అయితే కొంప మునిగేదనీ ఫీల్ అయ్యిందట జయసుధ. 
 

ఇండస్ట్రీలో మగవాళ్ల మధ్య ఎలా నెట్టుకొచ్చారు, చాలా సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా డీల్‌ చేశారని అడిగిన ప్రశ్నకు జయసుధ చెబుతూ, మనం లూస్‌గా ఉంటే వాళ్లకి ఛాన్స్ ఇచ్చినవాళ్లం అవుతాం, మనం కరెక్ట్ గా ఉంటే ఎవరూ మన జోలికి రారు అని తెలిపింది. అప్పట్లో తనకు నాన్న వెంటే ఉండేవాడట. ప్రతిదీ ఆయనే చూసుకునేవాడట. చాలా స్ట్రిక్ట్ అని తెలిపింది. దీంతో ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇచ్చేవాళ్లం కాదని, సీరియస్‌గా వర్క్ చేసుకునే వెళ్లిపోయే వాళ్లమని తెలిపింది. తానే కాదు చాలా మంది హీరోయిన్లు అలానే ఉండేవారని, ఇలాంటి ఎఫైర్లకి ఛాన్స్ లేదని, ఒకవేళ ఇద్దరూ ఇష్టపడితే అది వేరు అని తెలిపింది జయసుధ. చాలా క్రమ శిక్షణగా ఉండే ఇండస్ట్రీ సినిమానే అని, బయటే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయని తెలిపింది జయసుధ. 
 

click me!