రాజమౌళి, మహేష్ మూవీ సెట్స్ ఫొటోలు వైరల్‌!

Published : Mar 19, 2025, 12:15 PM IST

 SSMB 29: రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 మూవీ షూటింగ్ ఒరిస్సాలో జరిగింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
16
రాజమౌళి, మహేష్  మూవీ సెట్స్ ఫొటోలు  వైరల్‌!
unofficial look of Mahesh from the sets of this Rajamouli project in telugu

 SSMB 29:ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్‌ బాబు (Mahesh babu) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంపై ఎన్ని ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో తెలిసిందే. ఇదో మహేష్ బాబు కెరీర్ లోనే హైయిస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న భారీ చిత్రం.

26
unofficial look of Mahesh from the sets of this Rajamouli project in telugu

SSMB 29గా చెప్పబడుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొద్ది రోజులుగా ఒరిస్సాలో జరుగుతోంది. అక్కడ షూట్ పూర్తైన సందర్బంగా అక్కడ వాళ్లు దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

36
unofficial look of Mahesh from the sets of this Rajamouli project in telugu

 ఈ షూటింగ్ లో మహేష్ బాబు,  ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) లపై ప్రధానంగా సీన్స్ షూట్ చేసారు. గత 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతోంది.

46
unofficial look of Mahesh from the sets of this Rajamouli project in telugu

 సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్‌, బాల్డ ప్రాంతాల్లో నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్‌ పూర్తైంది.

దీంతో నటీనటులను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. సెట్‌కు చేరుకొని నటీనటులు, ఇతర చిత్ర టీమ్ తో ఫొటోలు దిగారు.

56
unofficial look of Mahesh from the sets of this Rajamouli project in telugu

పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు చిత్ర టీమ్ ని కలిశారు.

 రాజమౌళి ఇక్కడి ప్రకృతి అందాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదొక స్వర్గసీమ అని వర్ణించారు. జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారం ఎప్పటికీ మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు థాంక్స్‌ నోట్‌ను అధికారులకు అందించారు.

66
unofficial look of Mahesh from the sets of this Rajamouli project in telugu

 యూనిట్‌ సభ్యులందరూ మంగళవారం రాత్రే అక్కడినుంచి హైదరాబాద్‌కు బయలుదేరగా.. నటీనటులు, రాజమౌళి బుధవారం ఉదయమే వెళ్లిపోయారు. 

 బయలుదేరే ముందు హీరో మహేశ్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ కలెక్టర్ సస్యరెడ్డి, ఇతర అధికారులు కలిసి ఫొటోలు దిగారు.
 
click me!

Recommended Stories