పైన మీరు ఫోటోలో చూసిన పాప ఎవరో కాదు నటి రమ్యకృష్ణ. 1970 సెప్టెంబర్ 15న చెన్నైలో పుట్టిన రమ్యకృష్ణ ఇండియన్ సినిమాను ఏలింది. చిన్నప్పటి నుండే హీరోయిన్ కావాలనే కలలతో పెరిగిన రమ్యకృష్ణ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. నటనలో శిక్షణ తీసుకుంది.
1983లో విడుదలైన వెళ్లై మనసు అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో ఆమె డెబ్యూ మూవీ కంచు కాగడ. తమిళ అమ్మాయి అయినప్పటికి తెలుగువారే రమ్యకృష్ణను ఎక్కువగా ఆదరించారు.
కెరీర్ బిగినింగ్ లో రమ్యకృష్ణకు వరుస పరాజయాలతో ఎదురయ్యాయి. దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన సూత్రధారులు చిత్రంతో బ్రేక్ వచ్చింది. ఆ మూవీలో రమ్యకృష్ణ నటన, డాన్సులు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
రమ్యకృష్ణను కమర్షియల్ హీరోగా మార్చిన ఘనత దర్శకుడు కే రాఘవేంద్రరావు దక్కుతుంది. ఆయన వరుస చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ ఇచ్చాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించిన అల్లుడుగారు, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.
ఇక రమ్యకృష్ణ కెరీర్లో పడయప్ప ఎవర్ గ్రీన్ మూవీగా ఉంది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ లో రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ చేసింది. తెలుగులో నరసింహ టైటిల్ తో విడుదల చేయగా... ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. నీలాంబరి పాత్రలో రజినీకాంత్ ని కూడా ఆమె డామినేట్ చేసింది.
చిరంజీవితో అనేక సినిమాలు చేసిన రమ్యకృష్ణ అల్లుడా మజాకా లో పొగరుబట్టిన అమ్మాయి పాత్ర చేసింది. రమ్యకృష్ణ, రంభలతో చిరంజీవి ఆధిపత్య పోరు బాగుంటుంది. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన రమ్యకృష్ణ, డివోషనల్ పాత్రలు కూడా చేసింది. కమల్ హాసన్ నటించిన పంచతంత్రం మూవీలో రమ్యకృష్ణ వేశ్య రోల్ చేయడం విశేషం.
ఇక బాహుబలి చిత్రాల్లో శివగామిగా రాజసం పలికించింది. ఆ పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు అన్నరీతిలో రమ్యకృష్ణ నటన సాగింది. నాలుగు దశాబ్దాలుగా రమ్యకృష్ణ తిరుగులేని నటిగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమె చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి.
ఇక బాహుబలి చిత్రాల్లో శివగామిగా రాజసం పలికించింది. ఆ పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు అన్నరీతిలో రమ్యకృష్ణ నటన సాగింది. నాలుగు దశాబ్దాలుగా రమ్యకృష్ణ తిరుగులేని నటిగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమె చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి.