కానీ, నటి కావాలనే కోరిక మొదలైంది. కుటుంబ సభ్యులు ముందు అభ్యంతరం చెప్పినా, తర్వాత ఒప్పుకున్నారు. ఓ వైపు డాక్టర్ (ఎంబీబీఎస్) చేస్తూనే సినిమాలు చేస్తూ రాణిస్తుంది. శ్రీలీల రెండేళ్ల క్రితం ఇద్దరు వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది. బై టు లవ్ అనే కన్నడ చిత్రంలో చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించింది.
దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అబ్బాయి, అమ్మాయిని దత్తత తీసుకుంది. దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పుడు శ్రీలీల వయసు 21. ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తోంది.