పుష్ప 2 టికెట్ ధరలు, అదేమైనా కూడా గూడా... వర్మ మార్క్ థియరీ!

First Published | Dec 4, 2024, 12:58 PM IST

ట్రెండింగ్ టాపిక్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మార్కు విశ్లేషణ చేస్తుంటారు. అధికారికంగానే పుష్ప 2 టికెట్ ధర వెయ్యి రూపాయలు ఉందన్న సమాచారం నేపథ్యంలో, ఆయన స్పందించారు. ఇంతకీ వర్మ కోణం ఏమిటో తెలుసా..?

పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీపై ఉన్న హైప్ ఇంతా అంతా కాదు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్ తో పాటు హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ లో పుష్ప 2 నయా బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ , కల్కి వంటి బడా చిత్రాలకు మించి కొన్నారు. 

ఏపీ/తెలంగాణలలో పుష్ప 2 కనీసం రూ. 420 కోట్లు రాబడితే కానీ హిట్ స్టేటస్ అందుకోదు. ఇక బిజినెస్ రికవరీ చేసే క్రమంలో టికెట్స్ ధరలు అమాంతంగా పెంచేశారు. ఈ మధ్య కాలంలో పుష్ప టికెట్స్ ధరల స్థాయిలో మరో సినిమా టికెట్ ధరలు పెంచిన దాఖలాలు లేవు. మల్టీప్లెక్స్ లలో పుష్ప 2 టికెట్ ధర రూ. 900 వరకు ఉందట. అలాగే కొన్ని చోట్ల రూ. 1200 అట. ఇవి బ్లాక్ టికెట్ ధరలు అనుకుంటే పొరపాటే... అధికారికంగానే అంతగా పెంచారు. 


PUSHPA 2 TICKETS PRICE

దీనిపై విమర్శలు తలెత్తుతున్నాయి. కొందరు కేసులు కూడా వేశారు. పుష్ప 2 టికెట్స్ ధరలు రెండు మూడు రెట్లు పెంచి విక్రయిస్తుండగా... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశ్లేషణ చేశాడు. టికెట్ ధరలు పెంచితే ఎవరికి నష్టం? ధరలు పెంచడాన్ని విమర్శించవచ్చా? అనే కోణంలో ఒక కథ చెప్పాడు.  

''సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతా వారి  ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
 

కానీ కష్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు  సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.

 “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత  వెర్రితనం 

ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమానే...  

డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్  డిఫరెన్స్  మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్  లాగే  సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.

అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ  ఏడవనోళ్లు  సినిమా టికెట్ ధరల మీదే  ఎందుకు ఏడుస్తున్నారు ?

ఎంటర్టైన్మెంట్  నిత్యావసరమా? 

ఇల్లు, తిండి, బట్టలు ఈ  మూడింటి  కన్నా  ఎక్కువ అవసరమా?

అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్  ఉన్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. 

అలా అనుకొని  వారు  చూడటం  మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు  తగ్గాక  చూసుకోవచ్చు కదా?

మళ్ళీ  సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది  .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో  కూడా  కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!'' అని ట్వీట్ చేశాడు. 
పుష్ప 2 మూవీలో విషయం ఉందని నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే రేట్లు పెంచారు. దాని వలన ఏదైనా నష్టం జరిగితే అది వారే భరించాలి. మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు. టికెట్స్ ధరలు పెంచారని గగ్గోలు పెట్టడం అమాయకత్వం. ఎందుకంటే సినిమా.. ఉప్పు, పప్పు లాగా నిత్యావసరం కాదని.. వర్మ అభిప్రాయపడ్డారు. 
 

Latest Videos

click me!