హిందీలోనే ఎక్కువ.
పుష్ప 2 సినిమాకు సౌత్ లో కంటే హిందీలోనే ఎక్కువ ఆధరణ లభిస్తోంది. తెలుగులోకంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి పుష్పరాజ్ కు . హిందీ బెల్ట్ లో నాలుగు రోజులకు 300 కోట్లకుపైగా వసూళ్లు లభించినట్టు తెలుస్తోంది. హిందీలో ఇప్పటికీ పుష్ప సినిమా కోసం థియేటర్ల దగ్గర జాతర జరుగుతోంది.
మరీ ముఖ్యంగా యూపీ బీహార్ లో అల్లు అర్జున్ ప్యాన్స్ విజృంభిస్తున్నారు. ప్రత్యేకంగా స్క్రీన్స్ బుక్ చేసుకుని మరీ ఫ్యామిలీలతో సహా సినిమాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం పుష్ప మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పుష్పరాజ్ దండయాత్రకు భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తెలుగు తరువాత బన్నీకి పట్టు ఉన్న మలయాళంలో మాత్రం ఈసినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. మొదటి రోజు నుంచే పెద్దగా కలెక్షన్లు రావడంలేదని తెలుస్తోంది. మరి అక్కడి అభిమానులకు ఈసినిమా ఎందుకు నచ్చలేదు అనేది తెలియదు.