అనసూయ స్థానంలో వచ్చిన కొత్త యాంకర్ ని చూసి షాక్ తిన్న ప్రేక్షకులు... ఊహకు అందని ట్విస్ట్ ఇచ్చిన మల్లెమాల!

Published : Aug 05, 2022, 05:35 PM IST

జబర్దస్త్ కొత్త యాంకర్ విషయంలో మల్లెమాల టీం భారీ ట్విస్ట్ ఇచ్చింది. ముసుగు వెనకున్న అమ్మాయిని చూసి టీమ్ లీడర్స్ కంగుతిన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా నిరాశకు గురయ్యారు.   

PREV
19
అనసూయ స్థానంలో వచ్చిన కొత్త యాంకర్ ని చూసి షాక్ తిన్న ప్రేక్షకులు... ఊహకు అందని ట్విస్ట్ ఇచ్చిన మల్లెమాల!
Jabardasth

జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. గత ఎపిసోడ్ తో ఆమె 9 ఏళ్ల జర్నీ ముగిసింది. నటిగా బిజీ అయిన అనసూయ(Anasuya Bharadwaj) డేట్స్ కారణంగా జబర్దస్త్ నుండి తప్పుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆమె చెబుతున్న కారణం నిజం కాదని చెప్పొచ్చు. జబర్దస్త్ నుండి వెళ్లిపోవాలని డిసైడైన అనసూయ ఇతర ఛానల్స్ లో కొత్త షోస్ చేయడం విశేషం. 
 

29
Jabardasth

ఇదిలా ఉంటే ఆమె స్థానంలో కొత్త యాంకర్ ని తీసుకొస్తున్నట్లు మల్లెమాల పరోక్షంగా తెలియజేశారు. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో యాంకర్ గా కొత్త అమ్మాయి వస్తున్నట్లు చూపించారు. పల్లకిలో వచ్చిన కొత్త యాంకర్ ని చూడడానికి, ఆమె ఎవరో తెలుసుకోవడానికి జబర్దస్త్ టీమ్ లీడర్స్ పోటీపడ్డట్లు చూపించారు.

39
Jabardasth

ఈ లెజెండరీ కామెడీ షోకి వస్తున్న ఆ యాంకర్ ఎవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఏర్పడింది. గురువారం జబర్దస్త్ ప్రసారమయ్యే సమయానికి టీవీలకు అతుక్కుపోయి ఆమె రాక కోసం ఎదురుచూశారు. తీరా చూశాక ఉసూరుమన్నారు. చీర కొంగు ముఖానికి అడ్డుపెట్టుకొని స్టేజి పైకి వచ్చిన యాంకర్ కి రాఘవ, చంటి, వెంకీ, సుధాకర్ తమని తాము పరిచయం చేసుకున్నారు. 
 

49
Jabardasth

ఎంతకీ ముసుగు తీయకపోవడంతో చలాకీ చంటి ఆమె ముగుసు తొలగించాడు. ఒక్కసారిగా ఆ యాంకర్ ముఖం చూసి కంగుతిన్నారు. దానికి కారణం ఆ కొత్త యాంకర్ ఎవరో కాదు రష్మీ గౌతమ్(Rashmi Gautam). యాంకర్ గా కొత్త అమ్మాయి వస్తుంది అనుకుంటే నువ్వొచ్చావా... అంటూ నిట్టూర్చారు. 
 

59
Jabardasth

దానికి రష్మీ గౌతమ్ వివరణ ఇచ్చారు. నేను తెలుగు భాష లెక్క.. అక్కడా ఉంటా ఇక్కడా ఉంటా అంటూ ఓ పంచ్ డైలాగ్ విసిరింది. అయినా అప్పుడు ఇక్కడ నుండి(జబర్దస్త్) అక్కడకు(ఎక్స్ట్రా జబర్దస్త్) వెళ్ళాను. మళ్ళీ ఇక్కడకు వచ్చేశాను. నేను అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూ ఉంటాను కదా... అంటూ చెప్పుకొచ్చింది. 
 

69
Jabardasth


భారీ బిల్డ్ అప్ ఇచ్చి  చివరకు మొహం వాచిపోయిన రష్మీని చూసి ప్రేక్షకులు నీరుగారి పోయారు. ఇకపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా రష్మీ ముఖమే చూడాలి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు యాంకర్సే కరువైనట్లు జబర్దస్త్ కి కూడా రష్మినే యాంకర్ గా నియమించడం కొందరికి నచ్చలేదు. శ్రీముఖి, దీపికా పిల్లి, వర్షిణి వంటి యాంకర్స్ చేయడానికి సిద్ధంగా ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. 

79
Jabardasth


ఒకవేళ అనసూయ స్థానం భర్తీ చేయగల సత్తా ఒక్క రష్మీకి మాత్రమే ఉందని మల్లెమాల టీమ్ అభిప్రాయం కావచ్చు. కొత్త యాంకర్స్ ఎవరిని తెచ్చినా సక్సెస్ అవుతారనే నమ్మకం లేదు. కాబట్టి సేఫ్ సైడ్ కొన్నాళ్లు రష్మీ గౌతమ్ తో లాగిద్దాం.. ఫలితాలను బట్టి మార్పులు చేద్దామని భావిస్తూ ఉండవచ్చు. 

89
Jabardasth


ఏది ఏమైనా ఈ మధ్య మల్లెమాల నిర్ణయాలు కారణంగా వారు నిర్మిస్తున్న షోస్ మునుపటి క్రేజ్ కోల్పోతున్నాయి. రోజా, హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి స్టార్స్ జబర్దస్త్ ని వీడడం చాలా పెద్ద మైనస్ అయ్యింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ టీఆర్పీ పారిపోయింది. 

99

జడ్జెస్ సైతం వారానికొకరు మారుతున్నారు. సింగర్ మను ఒక వారం కనిపిస్తే మరోవారం కనిపించడు. ఈ మధ్య కుష్బూ ఎంటర్ అయ్యారు. ఇంద్రజ మాత్రం క్రమం తప్పకుండా షోలో కనిపిస్తున్నారు. ఇక భవిష్యత్ లో జబర్దస్త్(Jabardasth) టీఆర్పీ పెరుగుతుందో, తరుగుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories