సెంటిమెంట్‌తో కొట్టిన `పోకిరి` భామ.. ఇలియానా ఆ మ్యాజిక్‌ ని రిపీట్‌ చేయబోతుందా?

Published : Aug 05, 2022, 05:21 PM ISTUpdated : Aug 05, 2022, 05:56 PM IST

ఇలియానా అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. సినిమాలు లేకపోవడంతో బికినీ పోజుల్లో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. తాజాగా ఈ భామ ఫ్యాన్స్ ని సెంటిమెంట్‌తో కొట్టింది. ఆమె దెబ్బకి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.   

PREV
18
సెంటిమెంట్‌తో కొట్టిన `పోకిరి` భామ.. ఇలియానా ఆ మ్యాజిక్‌ ని రిపీట్‌ చేయబోతుందా?

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) సోషల్‌ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. వారిని ఎంగేజ్‌ చేస్తుంటుంది. మరోవైపు హాట్‌ ఫోటో షూట్లతోనూ కట్టిపడేస్తుంది. అందాల విందులో తనది మరో లెవల్‌ అని చాటుకుంటోంది. రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

28

తాజాగా ఈ సన్నజాజి నడుమందాల భామ ఇన్‌స్టాలో ఓ కొత్త మైలు రాయికి చేరుకుంది. 15 మిలియన్స్ ఫాలోవర్స్ కి చేరుకుంది. ఆమెని ఇన్‌స్టా గ్రామ్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్యం అక్షరాలు కోటిన్నర మంది కావడం విశేషం. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఓ క్యాండీడ్‌ పిక్‌ని పంచుకుంటూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. అయితేఈ సందర్భంగా ఆమె సెంటిమెంట్‌కి పెద్ద పీట వేయడం విశేషం. 
 

38

ఈ సందర్భంగా ఇలియానా చెబుతూ, ఈ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి నా వద్ద బెలూన్స్ లేవు. ఇంకా మరేమీ లేదు. కానీ ఐ లవ్‌ యూ గాయ్స్. 15 మిలియన్స్‌ మందికి థ్యాంక్యూ` అని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

48

ఇదిలా ఉంటే త్వరలో ఇలియానా తెలుగు ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతుంది. ముఖ్యంగా మహేష్‌ ఫ్యాన్స్ కి పండగ తీసుకురాబోతుంది. మరోసారి తన మ్యాజిక్‌ని రిపీట్‌ చేసేందుకు వస్తుంది. మరి ఇంతకి ఇలియానా ఏం చేయబోతుందంటే.. ఆమె నటించిన చిత్రం మరోసారి థియేటర్‌లో విడుదల కాబోతుంది. 
 

58

మహేష్‌బాబు(maheshbabu)తో కలిసి ఇలియానా నటించిన `పోకిరి`(Pokiri) చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విసయం తెలిసిందే. అప్పట్లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌. కలెక్షన్లకి ఒక ల్యాండ్‌ మార్క్ గా నిలిచింది. ఇందులో ఇలియానా నటించిన శృతి పాత్ర కూడా హైలైట్‌గా నిలిచింది. ఆమె సన్నని నడుము అప్పట్లో చాలా ఫేమస్‌. ఆ నడుముతోనే టాలీవుడ్‌ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించింది. వెండితెరపై రచ్చ రచ్చ చేసింది. కోట్లాది మంది అభిమానులను మాయ చేసేసింది. 
 

68

`పోకిరి` చిత్రంతోనే ఓవర్‌నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది ఇలియానా. యూత్‌కి డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. వరుసగా స్టార్‌ హీరోల ఆఫర్లు దక్కించుకుని కొన్నేళ్లపాటు నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయింది. 
 

78

అయితే ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా `పోకిరి` చిత్రాన్ని మరోసారి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా షోస్‌ వేస్తున్నారు. వీటికి సంబంధించిన బుకింగ్‌ కూడా పూర్తయ్యింది. దీంతో 16ఏళ్ల తర్వాత ఇలియానా మరోసారి తెలుగు ఆడియెన్స్ ని `శృతి`గా మెస్మరైజ్‌ చేయబోతుందని చెప్పొచ్చు. మరి ఆ మ్యాజిక్‌ మరోసారి వర్కౌట్‌ అవుతుందా? అనేది చూడాలి. 
 

88

ఇదిలా ఉంటే ఇలియానాకి సరైనా ఆఫర్లు లేవు. ఆమె కెరీర్‌ పరంగా చాలా స్ట్రగుల్‌ అవుతుంది. లవ్‌ బ్రేకప్‌, బాడీ షేమింగ్‌ కామెంట్లు, బరువు పెరగడం, డిప్రెషన్‌ వంటి కారణాలతో కెరీర్‌ బ్యాక్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ పుంజుకోలేకపోతుంది. ప్రస్తుతం ఆమె `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ`తోపాటు మరో హిందీ సినిమా చేస్తుంది. తెలుగులో నాలుగేళ్ల క్రితం రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` చిత్రంలో మెరిసింది. కానీ ఈ చిత్రం పరాజయం చెందింది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories