ఎన్టీఆర్(NTR) కి 12 మంది సంతానంలో నలుగురు కూతుళ్లున్న విషయం తెలిసిందే. సోమవారం చనిపోయిన కంఠమనేని ఉమా మహేశ్వరి(Uma Maheshwari) చిన్నకుమార్తె. ఆమె హఠాన్మరణం ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే వార్త సంచలనం క్రియేట్ చేస్తుంది. ఈక్రమంలో ఆమె జీవితంలోని అనేక విషాద ఘటనలు బయటకు వస్తున్నాయి.
ఎన్టీఆర్ ఫ్యామిలీలో చాలా మంది కన్నుమూశారు. ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు చిన్నప్పుడే చనిపోగా, మరికొందరు పెద్దయ్యాక అనారోగ్యంతోనూ కన్నుమూశారు. ఆ మధ్య హరికృష్ణ, ఆయన కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందనే వార్త హాట్ టాపిక్ అవుతుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి? అనేది మరింత సంచలనంగా మారుతుంది.
కంఠమనేని ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకి పాల్పడిందని ఆమె కూతురు దీక్షిత మీడియాతో వెల్లడిచారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర స్థాయిలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోందని, మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తుంది.
ఉమామహేశ్వరిని మొదట ఎన్టీఆర్.. నరేంద్ర రాజన్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడట. అనుకోని సంఘటనల ద్వారా విడిపోయారు. ఆమె జీవితంలో ఇది విషాదకర సంఘటన. ఆ తర్వత ఆమెకి కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌తో రెండో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కూతుళ్లు. పెళ్లి తర్వాత కూడా ఆ ఇబ్బందులు కంటిన్యూ అయ్యాయి. మానసికంగా, శారీరకంగా పలు సమస్యలను ఉమా మహేశ్వరి ఫేస్ చేసింది. గత జ్ఞాపకాలు మాత్రం ఆమెని నిత్యం వెంటాడేవని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆమె తీవ్ర స్థాయిలో మానసికంగా కృంగిపోయిందని, దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలుస్తుంది.
ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఆమె హఠాన్మరణంగా నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపిందనేది వాస్తవం.
ఏదేమైనా ఒక రాష్ట్రాన్ని శాషించిన మాజీ సీఎం కూతురు జీవితం ఇలాంటి దుర్భరంగా సాగడం, ఆమె జీవితంలో ఇంతటి కష్టాలు, కన్నీళ్లు, విషాద సంఘటలుండటం అత్యంత బాధాకరం. ఇది ఎన్టీఆర్ అభిమానులనే కాదు, సాధారణ ప్రజల హృదయాలను బరువెక్కిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.