దిల్‌రాజు డబుల్‌ గేమ్‌.. బంద్‌ని ఉల్లంఘిస్తూ తన సినిమా షూటింగ్‌.. తమిళంలో అంటూ షాక్‌.. వివరణతో కొత్త రచ్చ

Published : Aug 01, 2022, 06:07 PM ISTUpdated : Aug 01, 2022, 06:36 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు `టాలీవుడ్‌ షూటింగ్‌ బంద్‌`ని ఉల్లంఘిస్తూ తన సినిమాని చిత్రీకరణ జరుపుకోవడం పట్ల విమర్శొలుస్తాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

PREV
16
దిల్‌రాజు డబుల్‌ గేమ్‌.. బంద్‌ని ఉల్లంఘిస్తూ తన సినిమా షూటింగ్‌.. తమిళంలో అంటూ షాక్‌.. వివరణతో కొత్త రచ్చ

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు తాను నిర్మిస్తున్న `వారసుడు` చిత్ర షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు. తాను నిర్మించే చిత్రం తెలుగు చిత్రం కాదని తెలిపారు. ఇది పూర్తి తమిళ సినిమాగా వెల్లడించారు. తెలుగు సినిమాలు షూటింగ్‌ జరపడం లేదన్నారు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని స్పష్టం చేశారు. విజయ్‌తో నిర్మించే `వారసుడు` కేవలం తెలుగులో డబ్ చేస్తున్నారని, అది బైలింగ్వల్‌ కాదనే విషయాన్ని వెల్లడించారు. 

26

నేడు(ఆగస్ట్ 1) నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగ్‌లో బంద్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న ప్రొడక్షన్‌ కాస్ట్, వేతనాలు, హీరోల భారీ పారితోషికాలు వంటి వాటి కారణంగా ప్రొడక్షన్‌ కాస్ట్ పెరుగుతుందని, బడ్జెట్‌ మించిపోతుందని, థియేటర్‌లో రాబటి తగ్గిపోతుందని నిర్మాతలు వాపోతున్నారు. పైగా థియేటర్‌లోకి జనం రాకపోవడం, ఓటీటీలో సినిమాలు వెంటనే రిలీజ్‌ కావడం వల్ల థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్ శాతం దారుణంగా పడిపోయింది. దీంతో కలెక్షన్లు పడిపోతున్నాయి. వరుసగా సినిమాలు పరాజయం చెందుతున్నాయి. 

36

ఇవన్నీ నిర్మాతలను వెంటాడుతున్న సమస్యలు. దీని కారణంగా నిర్మాతలు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌కి, గిల్డ్, ఫిల్మ్ చాంబర్‌, ఫెడరేషన్‌కి మధ్య సంఖ్యత కుదరకపోవడంతో షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చారు. తెలుగు సినిమాలన్నీ బంద్‌ పాటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని తెలుగు చిత్రాలు బంద్‌కి అతీతంగా షూటింగ్‌లు జరుపుతున్నట్టు వార్తలొచ్చాయి. అందులో భాగంగా దిల్‌రాజు నిర్మిస్తున్న విజయ్‌ `వారసుడు`(వరిసు) చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోందీ. దీంతో అనేక విమర్శలు వస్తున్నాయి. 
 
 

46

ప్రొడక్షన్‌ కాస్ట్ పెరిగిపోతుందంటూ హడావుడి చేసిన దిల్‌రాజు బంద్‌కి పిలుపునిచ్చిన వారిలో ముందున్నారని, కానీ ఇప్పుడు ఆయనే బంద్‌ని ఉల్లంఘిస్తూ షూటింగ్‌ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో తాజాగా దీనిపై దిల్‌రాజు వివరణ ఇచ్చారు. `వారసుడు` చిత్రం తెలుగు సినిమా కాదని, బైలింగ్వ కూడా కాదనే విషయాన్ని చెప్పారు. అది పూర్తిగా తమిళ చిత్రమని తెలిపారు. తెలుగు సినిమాలన్నీ ఆగిపోయాయని తెలిపారు. 
 

56

దీనికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించడం విశేషం. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వారసుడు` చేస్తున్నారనే మొదట ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు దీన్ని తమిళ సినిమాగా ప్రకటించడం పట్ల విమర్శొస్తున్నాయి. దిల్‌రాజు వివరణ ఇచ్చినా ఆ విమర్శలు ఆగకపోవడం గమనార్హం. దీన్ని దిల్‌రాజు హైడ్రామాగా గుసగుసలాడుతున్నారు. దిల్‌రాజు డబుల్‌ గేమ్‌ ఆడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 

66

ఇదిలా ఉంటే వీటిపై ఇటీవల సీనియర్‌ నిర్మాత అశ్వినీదత్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొందరు నిర్మాతలు తమకు ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారని, రేట్లుపెంచుతున్నారని, టికెట్‌ రేట్లూ పెంచుకుంటున్నారని, మళ్లీ వాళ్లే తమకి సమస్య అవుతుందని రోడ్డుమీదకు వస్తున్నారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రొడక్షన్‌ ప్రాబ్లెమ్స్ అన్న వాళ్లే బంద్‌ కి పిలుపినిచ్చారని, మళ్లీ వాళ్లే ఆ బంద్‌ని ఉల్లంఘిస్తూ షూటింగ్‌ చేయడమేంటనే విమర్శలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories