
తెలుగు ఆడియెన్స్ కు ఉదయ భాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసిన ఉదయభాను. ఆడియన్స్ లో తన మాటలతో జోష్ నింపేది. బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఈ అందాల యాంకరమ్మ ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. స్టార్ కమెడియన్స్ వేణుమాధవ్ తో కలిసి వన్స్ మోర్ ప్లీజ్ తో పాపులర్ అయిన ఉదయభాను, ఆతరువాత రేలా రె రేలా, ఢీ , సాహసం చేయరా డింభకా, నువ్వు నేను.. ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించి అలరించింది
ఈమధ్య కాలంలో ఫీమేయిల్ యాంకర్స్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ ఇలా ఇంకొంతమంది యాంకర్స్ కూడా పాపులర్ అయ్యారు. వారు కూడా యాంకరింగ్ చేస్తూ.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే బుల్లితెరపై వీరందరికంటే ఎక్కువగా పేరు తెచ్చుకున్న ఉదయభాను మాత్రం కెరీర్ లో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఉదయభానుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఉదయభాను.. ఆతరువాత కనిపించకుండా పోయింది. అయితే ఆమె ఇండస్ట్రీలోని రాజకీయాలకు బలైపోయినట్టు తెలుస్తోంది. ఈ అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో ఉదయభాను స్వయంగా వెల్లడించారు.
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆతర్వాత యాంకరింగ్ ఫీల్డ్ కు దూరమయ్యింది. పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీలు,యాంకరింగ్ ఫీల్డ్ లో వెన్నుపోట్ల వల్ల ఆమె కెరీర్ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దాంతో చిన్నగా బుల్లితెరకు కూడా దూరమయ్యింది ఉదయభాను. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. అందులో రకరకాల వీడియోలు పెడుతున్నారు. తన ఫ్యామిలీ, పిల్లలతో పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ, వంటల వీడియోలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఇక చాలా కాలంగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న ఉదయభాను రీసెంట్ గా ఓ సినిమా లో నటించారు ఆ సినిమా ఈవెంట్ వేదిక పై ఉదయభాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
రీసెంట్ గా ఉదయభాను ఓ సినిమా ద్వారా రీఎంట్రీకి రెడీ అయ్యారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ టైటిల్ తో రాబోతున్న ఈసినిమాలో ఉదయభాను ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కట్టప్ప సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట తో పాటు మరికొందరు స్టార్స్ నటిస్తుండగా.. ఈసినిమాకు సబంధించి ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో ఉదయభానుకు ఓ ప్రశ్న ఎదురయ్యింది. గతంలో మీరు కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. యాంకర్స్ ను తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో అని. అది నిజమా అని అడిగారు. దానికి ఉదయభాను సమాధానం చెపుతూ.. " అది ఖచ్చితంగా నిజమే అండీ.. నేను నిజమైతేనే మాట్లాడుతాను. ఈ విషయం ఏ యాంకర్ ను అడిగినా పర్సనల్ గా చెపుతారు. కాని ఇప్పుడు అంతా నిశ్శబ్ధంగా ఉన్నారు కానీ.. ప్రతీ ఒక్కరికి తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఇది మాట్లాడటానికి సందర్భం కాదు ప్లీజ్ '' అంటూ ఉదయభాను అన్నారు. దాంతో ఆమె గతంలో అన్న మాటలు ఏంటా అని అందరు ఆలోచనలో పడ్డారు. ఉదయభానును తొక్కెయ్యడానికి చూసింది ఎవరు అని ఆలోచిస్తున్నారు.
గతంలో ఓ భామ అయ్యో రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉదయభాను చేసిన కామెంట్స్ అప్పుడు వైరల్ గా మారాయి.ఆ ఈవెంట్ లో యాంకరింగ్ చేసిన ఉదయభాను, మళ్లీ నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో లేదో తెలియదని.. ఇక్కడో పెద్ద సిండికేట్ ఏర్పడిపోయిందని అంటూ స్టేజ్ పైనే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ భామ అయ్యో రామ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయిన విజయ్ కనక మేడల మాట్లాడుతూ.. ఉదయభాను గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అన్నాడు. దాంతో ఉదయభాను మాట్లాడుతూ.. ఇదొక్కటే చేశానండీ.. మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ.. చేసేరోజుకి మనికి ఈవెంట్ ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం… మనసులో మాట కాబట్టే చెప్తున్నా” అంటూ ఉదయభాను అసహనం వ్యక్తం చేశారు. అలాగే రచయిత, నటుడు మచ్చ రవి మాట్లాడుతూ.. ఉదయభాను మైక్ పట్టుకుంటే.. ఒక నారి వంద తుపాకుల టైప్ అని అన్నారు. ఆ మాటతో ఉదయభాను.. ‘నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికీ తెలియదు’ అంటూ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ కి తాజాగా ‘త్రిబాణధారి బార్బరిక్’ ఈవెం్ లో క్లారిటీ ఇచ్చారు ఉదయభాను. మరి ఈ కామెంట్స్ ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.