ఉదయభాను లేటెస్ట్ వీడియో వైరల్, ఆమె కామెంట్స్ కి అర్థం ఏంటి.. పవన్ కళ్యాణ్ కోసమేనా ?

Published : Jan 23, 2023, 07:36 PM IST

ఉదయ భాను తెలుగు యాంకర్ గా ఎంత గుర్తింపు సొంతం చేసుకుందో తెలిసిందే. యాంకర్ గా, నటిగా ఆమె టాలీవుడ్ లో రాణించింది.

PREV
16
ఉదయభాను లేటెస్ట్ వీడియో వైరల్, ఆమె కామెంట్స్ కి అర్థం ఏంటి.. పవన్ కళ్యాణ్ కోసమేనా ?

ఉదయ భాను తెలుగు యాంకర్ గా ఎంత గుర్తింపు సొంతం చేసుకుందో తెలిసిందే. యాంకర్ గా, నటిగా ఆమె టాలీవుడ్ లో రాణించింది. విజయ్ కుమార్ ని వివాహం చేసుకున్న ఉదయభాను ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. 

26

గ్లామర్ పరంగా కూడా ఉదయభానుకు తిరుగులేదు. అందుకే లీడర్, జులాయి లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం దక్కించుకుంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో లీడ్ రోల్ లో కూడా నటించింది. 

36

అయితే అనసూయ, సుమ లాంటి యాంకర్స్ తరహాలో ఉదయభాను యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ అప్పుడప్పుడూ ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేస్తోంది. ఉదయ భాను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా ఉండడం లేదు. 

46

కానీ తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉదయభాను టీ తాగుతున్న వీడియో అది. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఆ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆమె ఈ వీడియో పోస్ట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమేనా అనే అనుమానం కలగక మానదు. 

56

గాజు గ్లాసులో ఉదయభాను టీ తాగుతున్న వీడియో పోస్ట్ చేసింది. గాజు గ్లాస్ చూపిస్తూ ' ఈ గ్లాస్ లో తీ తాగితే ఆ కిక్కే వేరబ్బా' అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పింది. బ్యాగ్ గ్రౌండ్ లో భీమ్లా నాయక్ సాంగ్ వినిపిస్తుండడం విశేషం. ఈ వీడియోకి పవర్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది. దీనితో ఉదయభాను జనసేన పార్టీకి మద్దతుగా ఈ వీడియో పోస్ట్ చేసిందని స్పష్టంగా అర్థం అవుతోంది. గాజు గ్లాస్ అనేది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అనే సంగతి తెలిసిందే. 

 

66

ఉదయభాను వీడియోకి నెటిజన్లు జై జనసేన అని కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది సినీ సెలెబ్రిటీలు వారికి నచ్చిన పార్టీలకు సపోర్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. బహుశా ఉదయ భానుకి కూడా పొలిటికల్ గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయేమో చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories