ట్రాన్స్ఫరెంట్‌ శారీలో అనుపమా పరమేశ్వరన్‌ అదిరిపోయే ట్రీట్‌.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ లో ప్రైవేట్‌ ఈవెంట్‌లో రచ్చ

Published : Jan 23, 2023, 07:08 PM ISTUpdated : Jan 23, 2023, 08:48 PM IST

క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ చీర కడితే రచ్చ రంభోలా అయిపోవాల్సిందే. శారీలో అనుపమా అందం మరింత పెరిగిపోతుంది. అదే బ్లాక్‌ శారీ కడితే కుర్రాళ్లకి దేత్తడే..   

PREV
18
ట్రాన్స్ఫరెంట్‌ శారీలో అనుపమా పరమేశ్వరన్‌ అదిరిపోయే ట్రీట్‌.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ లో  ప్రైవేట్‌ ఈవెంట్‌లో రచ్చ

అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) క్యూట్‌ బ్యూటీ నుంచి హాట్‌ బ్యూటీ గా టర్న్ తీసుకుంటుంది. కుంచకు అందని, కవికి వర్ణించతరం కాని అందంతో, వొంపు సొంపులతో అభిమానులను, నెటిజన్లని అలరిస్తుంది అనుపమా పరమేశ్వరన్‌. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్‌ శారీ కట్టింది. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

28

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఈవెంట్లో పాల్గొంది అనుపమా పరమేశ్వరన్‌. ఎల్బీ నగర్‌లో జరిగిన ఓ ప్రాపర్టీకి సంబంధించిన బ్రోచర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. మరో క్రేజీ బ్యూటీ శ్రీలీలా, యంగ్‌ సెన్సేషన్‌ సిద్ధు జొన్నలగడ్డ(డీజే టిల్లు) పాల్గొని సందడి చేశారు. 

38

ఇందులో బ్లాక్‌ శారీలో మెరిసింది అనుపమా పరమేశ్వరన్‌. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, ట్రాన్స్ఫరెంట్‌ శారీ కట్టింది. తన నడుము అందాన్ని దాయలేని కొంగుతో విజువల్‌ట్రీట్‌ ఇస్తుంది. చిలిపి నవ్వులతో మతిపోగొడుతుంది. ఈ ఈవెంట్‌లో అనుపమా హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

48

అనుపమా పరమేశ్వరన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకుంది. `కార్తికేయ2`తో ఇండియా వైడ్‌గా బ్లాక్‌ బస్టర్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఓటీటీలోనూ దీనికి విశేష ఆదరణ దక్కింది. ఇందులో ఆమె బలమైన పాత్రలో మెరిసింది. 
 

58

ఆ తర్వాత `18పేజెస్‌` అనే ఓ బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ చిత్రంలో నటించింది. సరికొత్త, స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రంలో ఆమె మెరిసింది. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. నిఖిల్‌ని డామినేట్‌ చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతోపాటు `బట్టర్‌ ఫ్లై` అనే ఓ సినిమాలోనూ మెరిసింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది. ఇందులో సినిమాని తన భుజాలపై మోసింది. ఇక `18పేజెస్‌` చిత్రం ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 27న అది స్ట్రీమింగ్‌ కానుంది. 

68

అనుపమా పరమేశ్వరన్‌ సక్సెస్‌ జోరులో ఉంది. ఓ వైపు వరుసగా విజయాలతోపాటు, మరోవైపు గ్లామర్‌ ఫోటోలతోనూ నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కవ్వించే పోజులతో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంటుంది. 

78

అయితే ఈ బ్యూటీ రాను రాను గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలానే ఉండాలనే కట్టుబాట్లని పటాపంచల్‌ చేస్తూ హాట్‌ షోకి సిద్ధమవుతుంది. మరీ బోల్డ్ గా కాకుండా ఉన్నంతలో హాట్‌గా, మరింత అందంగా కనిపిస్తూ రెచ్చగొడుతుంది. పరువాల విందు, నడుము వొంపులతో పిచ్చెక్కిస్తుంది. అదిరిపోయే విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. 
 

88

అనుపమా పరమేశ్వర్‌ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే `టిల్లు స్వ్కైర్‌`లోనూ నటిస్తున్నట్టు తెలుస్తుంది. మొదట ఆమెని ఓకే చేశారు, ఆ తర్వాత హీరోతో విభేదాలతో తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ఆమె ఓకే చెప్పిందని టాక్‌. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories