ఆ ముగ్గురూ కాదు, చిరంజీవి నెంబర్ 1 అని డిసైడ్ చేసిన డైరెక్టర్..ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలా తిట్టారో తెలుసా

First Published | Nov 2, 2024, 10:23 AM IST

నాలుగు దశాబ్దాల పాటు చిరంజీవి తన ఆధిపత్యం కొనసాగించారు. చిరంజీవి ఈ క్రమంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు అందుకున్నారు. అగ్ర దర్శకులతో పనిచేశారు. దాసరి, రాఘవేంద్ర రావు లాంటి లెజెండ్రీ దర్శకులతో సైతం చిరు పనిచేశారు.

మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ అగ్ర స్థానాన్ని అధిరోహించిన హీరో చిరంజీవి. నాలుగు దశాబ్దాల పాటు చిరంజీవి తన ఆధిపత్యం కొనసాగించారు. చిరంజీవి ఈ క్రమంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు అందుకున్నారు. అగ్ర దర్శకులతో పనిచేశారు. దాసరి, రాఘవేంద్ర రావు లాంటి లెజెండ్రీ దర్శకులతో సైతం చిరు పనిచేశారు. అయితే దాసరి, చిరంజీవి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంత విభేదాలు తలెత్తాయి. 

రాజకీయంగా చిరంజీవి, దాసరి నారాయణరావు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాల గురించి దాసరి నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి నాకు బంధువు. ఆయనతో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతి ఒక్కరి మధ్య సహజమే. వాటిని మీడియా పెద్దగా చేసి చూపించింది అని దాసరి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 


వజ్రోత్సవాల వేడుక సమయంలో నేను కొంత బాధపడ్డాను. ఆయా తర్వాత రాజకీయంగా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అంతే తప్ప మా మధ్య ఇంకెలాంటి గొడవలు లేవు. నేను ఏం మాట్లాడిన దానిని చిరంజీవికి అన్వయిస్తున్నారు అని దాసరి అన్నారు. ఆ లెక్కన చిరంజీవిని నా కంటే ఎక్కువగా పొగిడిన వాడు లేడు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో  బాగా ఎదుగుతున్న సమయంలో నేను ఒక మాట చెప్పాను. 

టాలీవుడ్ లో నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు అన్ని స్థానాలు చిరంజీవివే.. ఆ తర్వాతే ఎవరైనా అని చెప్పా. ఆ మాట చెప్పడానికి ఎంత గట్స్ కావాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ నన్ను పిలిచి తిట్టారు. ఎన్టీఆర్ గారు మా అబ్బాయి నంబర్ ఎంత అని అడిగారు, ఏఎన్నార్ గారు అదే విధంగా నన్ను ప్రశ్నించారు. రామానాయుడు గారు అయితే మా అబ్బాయి నంబర్ ఎంతయ్యా 14, 15 అని కోపంగా అడిగారు. అలాంటి హేమా హేమీల పిల్లలని కాదని నేను చిరంజీవి పేరు చెప్పా అని దాసరి గుర్తు చేసుకున్నారు. 

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో తాను ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా సాయం చేసానని ఆయా విషయం చిరంజీవికి మాత్రమే తెలుసు అని దాసరి అన్నారు. ఎలాంటి విభేదాలు ఉన్నా తాము ఎప్పుడూ మాట్లాడుకోకుండా ఉండలేదు అని అన్నారు. ఎప్పుడు కలిసినా హాయిగా మాట్లాడుకుంటాం. కాకుంటే నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలకు విపరీత అర్థాలు తీసి విభేదాలు సృష్టిస్తుంటారు అని దాసరి అన్నారు. 

Latest Videos

click me!