Hit 3: నాని ‘హిట్-3’లో ఆ ఇద్దరు హీరోలు కూడా ?

Published : Feb 13, 2025, 09:19 AM IST

  Hit 3:  నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న 'హిట్ 3'లో మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. జమ్మూ కాశ్మీర్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

PREV
13
  Hit 3: నాని ‘హిట్-3’లో ఆ  ఇద్దరు హీరోలు కూడా ?
Two young Heros in Nani HIT 3 in telugu


 నాని(Nani).. దర్శకుడు శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ (Hit 3). వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్.

ఇది ఈ ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. 

23
Nanis Hit 3 upcoming film update out

‘హిట్-3’ భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. అర్జున్‌ సర్కార్‌గా నాని శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనువిందు చేయనున్నారు.   అర్జున్‌ సర్కార్‌ పేరుతో పవర్‌ ఫుల్‌ జమ్మూ అండ్ కశ్మీర్‌ పోలీస్ ఆఫీసర్ గా నానిని ఈ సినిమాలో దర్శకుడు శైలేష్‌ కొలను చూపించబోతున్నాడు.

ఈసారి కేసు ఇన్వెస్టిగేషన్ జమ్మూ కశ్మీర్‌ లో ఉండబోతుంది. ఇప్పటికే కశ్మీర్‌లో చిత్రీకరణ  చేసారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ లు సినిమాలో హైలెట్ కానున్నాయి.  హిట్ తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, హిట్-2 హీరో అడివి శేష్ ఇప్పుడు హిట్-3లో కేమియో పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

33
Two young Heros in Nani HIT 3 in telugu


2020 లో విశ్వక్‌సేన్ హీరోగా హిట్ : ఫస్ట్‌ కేస్‌ వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వెంటనే దర్శకుడు శైలేష్ కొలను 2022 లో హిట్ : సెకండ్‌ కేసును ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

అడవి శేష్‌ హీరోగా హిట్ 2 రూపొందిన విషయం తెల్సిందే. హిట్‌ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్‌ 3 ని అంతకు మించి ఉండేలా దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్‌ చేశాడు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమా ను ప్రకటించారు. మొదట అనుకున్న శ్రీకాంత్ ఓదెల సినిమాను నాని పక్కన పెట్టి మరీ హిట్ 3 ని ముందు చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.

Read more Photos on
click me!

Recommended Stories