Sankranthiki Vasthunam: బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్

Published : Feb 13, 2025, 08:20 AM IST

 Sankranthiki Vasthunam:  ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ చిత్రంలో బుల్లి రాజుగా నటించిన రేవంత్ భీమాల పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. రాజకీయ పోస్టులు పెడుతుండటంతో ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PREV
13
 Sankranthiki Vasthunam: బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్
Sankranthiki Vasthunam Kid Bulli raju father Filed police complaint in telugu


‘సంక్రాంతికి వస్తున్నాం’ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాలకి ఓవర్ నైట్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నాడు.

 ఇటీవల సక్సెస్‌ మీట్‌లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.అయితే బుల్లి రాజు ఫేమ్‌ను కొందరు సోషల్ మీడియా వేదికగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రేవంత్ భీమాల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ బాలుడి తండ్రి   శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.  పోలీస్ కంప్లైంట్ కూడా చేసారు.

23
Sankranthiki Vasthunam Kid Bulli raju father Filed police complaint in telugu


బుల్లి రాజు తండ్రి పెట్టిన పోస్ట్ లో ...

 “సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ద్వారా ఆదరించి, ఆశీస్సులు అందచేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా (X) వేదికగా తమ అబ్బాయి పేరు మీద FAKE ACCOUNT లు క్రియేట్ చేసి సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు & అప్డేట్స్ సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమ్లా అనే పేరు మీద ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటామన్నారు.

ఇది తప్ప ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తమకు ఎలాంటి ఇతర అకౌంట్లు, ఛానెల్స్ లేవని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సర్క్యూలేట్ చేస్తున్న విషయమై పోలీస్ వారికి ఫిర్యాదు చేశామన్నారు.  దయచేసి తమకు, ముఖ్యంగా తమ అబ్బాయిని ఇటువంటి వివాదాలు రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నట్లు ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది. 

33


ఇంతకీ బుల్లిరాజు పేరుతో ఉన్న పోస్టు లో ఏముందంటే?

బుల్లిరాజు పేరుతో ట్విట్టర్ అకౌంట్‌లో ఒక సంచలన పోస్టు ఉంది. పేటియం గాళ్లు బాగా కష్టపడ్డారు కానీ.. బ్రతుకులు ఎందుకురా? అని అందులో ఉంది. అంతేకాకుండా దొంగ ఓట్లతో గెలుద్దాం అనుకున్నప్పుడే మీకు 11 వచ్చాయని.. 10 నిమిషాల్లో 30వేల ట్వీట్స్ వేయించారంటే మీరు ఎంత ఫేక్ బతుకు బతుకుతున్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

అక్కడితో ఆగకుండ మీరు ఎంత గింజుకున్నా అకౌంట్ డిలీట్ చెయ్యనులే అని.. వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు అని అందులో ఉంది. దీంతో చాలా మంది ఆ పోస్టుపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు దీనిపై బుల్లిరాజు తండ్రి స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

 

Read more Photos on
click me!

Recommended Stories