మరణించిన ఆ వ్యక్తి పక్కనుంటే నటించలేనని చెప్పేసిన జూ.ఎన్టీఆర్, మరో ఇద్దరు కూడా..

Published : Feb 13, 2025, 08:08 AM IST

Jr NTR: ఎన్టీఆర్ కి కూడా కొన్నిసందర్భాలలో నటించడం కష్టం అట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. కొందరు వ్యక్తులు తన పక్కన ఉంటే నటించలేనని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

PREV
15
మరణించిన ఆ వ్యక్తి పక్కనుంటే నటించలేనని చెప్పేసిన జూ.ఎన్టీఆర్, మరో ఇద్దరు కూడా..
Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనకి, డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. గతేడాది ఎన్టీఆర్ నుంచి దేవర చిత్రం విడుదలైంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

25

ఎన్టీఆర్ నటన గురించి అందరికంటే బాగా రాజమౌళి చెప్పగలరు. తాను ఎలా అడిగితే ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ని తారక్ ఇస్తాడని రాజమౌళి చాలా సందర్భాల్లో ప్రశంసించారు. అలాంటి ఎన్టీఆర్ కి కూడా కొన్నిసందర్భాలలో నటించడం కష్టం అట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. 

35
Venu Madhav

కొందరు వ్యక్తులు తన పక్కన ఉంటే నటించలేనని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వ్యక్తులు ఎవరో కాదు.. ముగ్గురు క్రేజీ కమెడియన్లు బ్రహ్మానందం, వేణు మాధవ్, అలీ అని ఎన్టీఆర్ తెలిపారు. వీరిలో వేణు మాధవ్ మరణించారు. ఎన్టీఆర్, వేణు మాధవ్ మధ్య సింహాద్రి, బృందావనం లాంటి చిత్రాల్లో అద్భుతమైన కామెడీ సన్నివేశాలు ఉన్నాయి. 

45
Brahmanandam

వీళ్ళు పక్కన ఉంటే నటించడం చాలా కష్టం. ఎందుకంటే నవ్వు ఆపుకోలేను. చాలా టేకులు వేస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటూ ఎన్టీఆర్ సరదాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

55
Comedian Ali

కొన్నిసార్లు 15 టేకులు కూడా అవసరం అయ్యాయి అని తారక్ పేర్కొన్నారు. ఈ మాటలని ఎన్టీఆర్ వేణు మాధవ్ తోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వేణు మాధవ్ అనారోగ్యం కారణంగా మరణించారు. సీనియర్ కమెడియన్లుగా ఉన్న బ్రహ్మానందం, అలీ జోరు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా తగ్గింది. 

Read more Photos on
click me!

Recommended Stories