`జబర్దస్త్`‌ నుంచి వాళ్లు ఔట్‌..? ప్రోమోతో హింట్ ఇచ్చిన టీం!

Published : Jun 24, 2020, 10:59 AM ISTUpdated : Jun 24, 2020, 11:02 AM IST

కరోనా ప్రభావం వినోద పరిశ్రమ మీద తీవ్ర స్థాయిలో ఉంది. రెండు నెలలకు పైగా సినిమాలు సీరియల్స్‌కు సంబంధించిన సినిమాలన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఛానల్స్‌కు కూడా భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాతలు నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డారు.

PREV
15
`జబర్దస్త్`‌ నుంచి వాళ్లు ఔట్‌..? ప్రోమోతో హింట్ ఇచ్చిన టీం!

కరోనా ప్రభావం సూపర్‌ హిట్ షో మీద కూడా కనిపిస్తోంది. ఇటీవల లాక్‌ డౌన్‌ సడలింపులతో షూటింగ్ లు తిరిగి షురూ అయ్యాయి. ఈ వారంలోనే కొన్ని కార్యక్రమాలు పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి చానల్స్‌. ఈ నేపథ్యంలో సూపర్‌ కామెడీ షో జబర్దస్త్‌ కూడా రీ టెలికాస్ట్‌కు రంగం సిద్ధమైంది. (courtesy: mallemala entertainments)

25

ఇప్పటికే న్యూ లుక్‌లో రెడీ అయిన యాంకర్‌ అనసూయ ఫోటోలు వైరల్‌ కాగా తాజాగా ప్రొమో కూడా విడులైంది. ఈ నెల 25న ప్రసారం కానున్న షోకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. దీంతో షో మీద సరికొత్త చర్చ మొదలైంది. ఈ ప్రొమోలో `ఆ రెండు టీమ్‌లు పోయాయి` అనే డైలాగ్‌ ఇప్పుడు చర్చకు కారణమైంది. (courtesy: mallemala entertainments)

35

రీ స్టార్ట్‌ అయిన షోలో ఆరు టీంలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. చివర్లో వచ్చే వెంకీస్‌ మంకీస్‌ టీం `అలాంటి పంచ్‌లు వేసినందుకు ఆ రెండు టీంలు పోయాయి` అన్న డైలాగ్ వాడటం, `ఆ రెండు టీంల నుంచి తీసేస్తే ఇలా వచ్చాం` అని జీవన్‌ శాంతి కుమార్‌లు చెప్పటం కూడా  అనుమానాలకు తావిస్తోంది. (courtesy: mallemala entertainments)

45

రిలీజ్‌ అయిన ప్రోమోను బట్టి చూస్తే జిగేల్‌ జీవన్‌, మస్తీ మహీదర్‌, ఫసక్‌ శశి, శాంతికుమార్‌ల టీంలను మిస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ టీంలను తొలగించడానికి కారణం ఏంటి అన్నది మాత్రం వెల్లడించలేదు. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. (courtesy: mallemala entertainments)

55

ఈ టీవీలో ప్రసారం అయ్యే ఈ షోను మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోంది. ఈ నెల 25న షోను రీస్టార్ట్‌ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి ప్రకటించినా తాజాగా టీవీ షూటింగ్‌లో కరోనా కలకలం సృష్టించటంతో తిరిగి షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌ రీ స్టార్ట్ చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తెలుగు టెలివిజన్‌ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిషోగా పేరు తెచ్చుకున్న జబర్ధస్త్ ఇప్పటకీ టాప్‌ రేటింగ్‌లతో దూసుకుపోతోంది. (courtesy: mallemala entertainments)

click me!

Recommended Stories